బౌద్ధమతాన్ని అసలు ఎందుకు నేర్చుకోవాలి?

మనం బౌద్ధ సందర్భంలో ధ్యానం గురించి మాట్లాడినప్పుడు, ఒక ఖచ్చితమైన విషయం గురించి మాట్లాడుతున్నాము. ఈ రోజుల్లో, మనం అన్ని చోట్లా తరచుగా "ధ్యానం" అనే పదాన్ని వింటున్నాము, ఎందుకంటే దీనికి చాలా మంచి అర్ధం ఉంది మరియు చాలా మంది దీనిని విశ్రాంతి పొందడానికి ఉపయోగిస్తున్నారు. ఏదేమైనా, ధ్యాన సాధన విషయానికి వస్తే, చాలా మందికి అది అసలు ఎలా చెయ్యాలో తెలియదు. మనం ఒకచోట కూర్చొని నిశ్శబ్దంగా ఉండాలని తెలుసు: కానీ ఆ తర్వాత ఏం చెయ్యాలి? కేవలం శ్వాసపై దృష్టి పెట్టి మంచి ఆలోచనలను కలిగి ఉండటమేనా?

సంస్కృతంలో ధ్యానం అనే పదానికి దేన్నైనా నిజంగా మార్చడం అనే అర్థం వస్తుంది. టిబెటన్లు దీనిని ఒక ఖచ్చితమైన అలవాటును పెంపొందించుకోవడం అని అర్థం వచ్చే పదంతో అనువదించారు. మనం ఒక అలవాటును పెంపొందించుకున్నప్పుడు, మనం ఏదో ఒక భాగాన్ని మనలో అన్వయించుకుంటాము, మరియు ధ్యానంతో అలా చెయ్యడానికి ప్రయత్నిస్తాము. మనలో ఒక ప్రయోజనకరమైన మార్పును తీసుకురావాలనుకుంటున్నాం. ముందుగా ఇక్కడ అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, అసలు మనం ఎందుకు మారాలనుకుంటున్నాము? సాధారణంగా మనం మన జీవితాలను గడిపే విధానం, లేదా మనం అనుభూతి చెందే విధానం లేదా ఇతర వ్యక్తులతో లేదా మన పనితో సంబంధం ఉన్న విధానంతో మనం చాలా సంతోషంగా ఉండకపోవడమే దీనికి కారణం. ఈ లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది, కానీ మనలో చాలా మందికి ఉన్న లక్ష్యం మన జీవితాలను మెరుగుపరుచుకోవడం.

సమస్యల నుంచి తప్పించుకోవడానికి బదులుగా వాటితో వ్యవహరించడం

మనం మారాలనుకోవడం మరియు మెరుగుపడాలని అనుకోవడం ఒక ముఖ్యమైన విషయం. మన ధ్యానం ద్వారా ఏదో ఒక కల్పిత చోటుకి వెళ్లిపోవాలని మనం అనుకోవడం లేదు; దానికి డ్రగ్స్ మరియు ఆల్కహాల్ లాంటి ఇతర మార్గాలు చాలా ఉన్నాయి, కావాలంటే మనం వాటిని ఉపయోగించుకోవచ్చు. మనం రోజంతా సంగీతం వినగలం కాబట్టి మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తరచుగా, అలాంటి వాటి ప్రభావానికి గురైనప్పుడు, మన సమస్యలు అంత ఎక్కువగా ఉన్నట్టు అనిపించవు. కానీ సమస్యలు ఎప్పుడూ తిరిగి వస్తాయి, ఎందుకంటే మనం వాటిని ఎదుర్కోవడం నేర్చుకోలేదు కాబట్టి. చాలా మంది ధ్యానాన్ని ఒక డ్రగ్ లా ఉపయోగిస్తారు, కానీ ఇది ఎక్కువ రోజులు అలా పని చెయ్యదు. మనం గంటలు మరియు డప్పులను మోగించవచ్చు - కొంచెం బౌద్ధ డిస్నీల్యాండ్ లాగా - కానీ ఇది నిజంగా మనలో ఎటువంటి మార్పును తీసుకురాదు: ఇది కేవలం ఒక ఎస్కేప్ లానే ఉంటుంది.

అయితే, బౌద్ధమత సంప్రదాయంలో ఉద్దేశించబడిన విధంగా ధ్యానాన్ని మనం ఆచరిస్తే, మన సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడం కాకుండా, వాటిని ఎదుర్కుని అధిగమించగలం. దీనికి నిజంగా చాలా సాహసం మరియు ప్రయత్నం అవసరం, ఎందుకంటే ఇది అంత సులభం కాదు. అది సరదాగా ఉండదు, అందుకే మనం సిద్ధంగా ఉండాలి. మనం దీనిని శారీరక శిక్షణతో పోల్చవచ్చు, ఇక్కడ ఇది కష్టంగా ఉండి మన కండరాలకు నొప్పి తెప్పిస్తుంది. కానీ బలంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి మనం ఈ కష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాము.

మనం ధ్యానం చేసేటప్పుడు కూడా అలాగే ఉంటుంది, కానీ ఇక్కడ మనం మన శరీరంపై కాకుండా మనస్సుపై భారం పెడతాము. బౌద్ధమతంలో కొన్ని రూపాలు ఉన్నాయి, ఇక్కడ మీరు ధ్యానంతో పాటు శరీరంపై పనిచేయడం, మార్షల్ ఆర్ట్స్ వంటివి చెయ్యడం ఉంటుంది, కానీ టిబెటన్ సంప్రదాయంలో అలా ఉండదు. శరీరానికి శిక్షణ ఇవ్వడంలో తప్పేమీ లేదు, నిజానికి ఇది చాలా ఉపయోగకరమైనది; కానీ, ఇక్కడ ప్రధాన దృష్టి మన మనస్సుపై ఉండాలి, మన బుద్ధి మీద కాకుండా, మన భావోద్వేగాలు మరియు హృదయంపై ఉండాలి. గొప్ప బౌద్ధ గురువులు బౌద్ధ అభ్యాసాన్ని ప్రారంభించేటప్పుడు, మనస్సును అవలంబించుకోవడం చాలా ప్రాథమికమైన విషయం అని చెప్తారు. ఎందుకంటే మనం ప్రవర్తించే విధానం, ఇతరులతో సంభాషించే విధానం అన్నీ మన మానసిక స్థితిని నిర్ణయిస్తాయి.

మనకు మనమే నిజాయితీగా కనిపించడం

మన జీవితాలలో ఇబ్బందులు ఉన్నాయని మనం గుర్తిస్తాము, వాటికి మూలం మన మనస్సులో అసంతృప్తికరమైన భావన అని తెలుస్తుంది. మనల్ని మనం నిజాయితీగా పరిశీలిస్తే, కోపం నుంచి దురాశ, స్వార్థం, అసూయ, మమకారం, అహంకారం, అమాయకత్వం వరకు చాలా ఇబ్బంది పెట్టే విషయాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఈ లిస్ట్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మనం ఇంకా లోతుగా వెళితే జీవితం అంటే ఏమిటో కొంత అభద్రతాభావం, మరియు అయోమయం కనిపిస్తాయి. ఈ ఇబ్బందిపెట్టే భావోద్వేగాలు మన మానసిక స్థితిపై ఆధిపత్యం చెలాయిస్తాయి. సమస్యలను సృష్టించే విధంగా ఇతరులతో ప్రవర్తించడానికి, మాట్లాడటానికి మరియు సంబంధం కలిగి ఉండటానికి కారణమవుతాయి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, మన మనస్సు అసౌకర్యంగా, అన్ని రకాల ఇబ్బంది పెట్టే ఆలోచనలతో నిండి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే అప్పుడు మనం సంతోషంగా అస్సలు ఉండలేము.

ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ధ్యానం బాగా పనిచేస్తుంది. మనం దేని గురించి అస్సలు ఆలోచించకుండా ఉండటానికి మందులు తీసుకోవడంలా ఇది ఉండదు. కొంతమంది ధ్యానాన్ని ఇలా చూసినా కానీ ఇది అలా ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారంటే నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని కళ్లు మూసుకుని ఉంటే వాళ్ళ సమస్యలన్నీ పోతాయని అనుకుంటారు. ఇది అలా జరగదు. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి.

అసలైన శత్రువుని కనిపెట్టడం

మన భావోద్వేగాలే మన నిజమైన శత్రువుగా చెప్పే నిజాలను బౌద్ధ సాహిత్యంలో మనం చూడవచ్చు. మనల్ని చూసి మనం భయపడి మతిస్థిమితం కోల్పోయేలా, ఒక రాక్షసుడిగా మార్చడం లేదు. దీనికి బదులుగా, మనం పని చేయాల్సింది ఇంకా ఉందని గుర్తించాలి. మన దగ్గర చాలా అందమైన బౌద్ధమత గ్రంధాలు ఉన్నాయి., అవి ఈ సమస్యల గురించి మాట్లాడతాయి. అవి ఇలా చెప్తాయి, "నాకు ఇన్ని సమస్యలు మరియు ఇబ్బందులు ఇంక సరిపోతాయి. ఇప్పుడు నీ సమయం ఆసన్నమయింది." అందుకని మనం సిద్ధం అయ్యి ఒక చోట కూర్చొని మన మనస్సుని మార్చుకునే ప్రయత్నం చేస్తాం. ధ్యానం అంటే ఇదే.

సింపుల్ గా చెప్పాలంటే, ధ్యానం అనేది ఒక పద్ధతి, దీని ద్వారా మనం ప్రయోజనకరమైన అలవాట్లను అలవరచుకోవడంలో మరియు చెడు అలవాట్లను వదులుకోవడంలో శిక్షణను పొందుతాము. ఇవి మనం ఆలోచించే విధానం, మనం అనుభూతి చెందే విధానం మరియు భావోద్వేగంగా ప్రతిస్పందించే విధానం యొక్క అలవాట్లు. దీనికి శిక్షణ మరియు ఎక్కువ సార్లు చెయ్యడం అవసరం పడుతుంది. ఇది ఒక శాస్త్రీయ పద్ధతి. అథ్లెటిక్స్ లో శిక్షణ పొందినప్పుడు, సంగీత వాయిద్యం వాయించినప్పుడు లేదా నృత్యం చేసినప్పుడు, మొదట్లో మనకు ఇది ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. కానీ మనం ఏదైనా విషయాన్ని తెలుసుకున్న తర్వాత, అది మనకు చాలా సహజమైనదిగా అనిపిస్తుంది. మన మనస్సు, భావోద్వేగాలు, అనుభూతుల విషయంలోనూ అదే జరుగుతుంది.

అసలు మార్పు అనేది సాధ్యమేనా?

ఇప్పుడు, ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అసలు మనం నిజంగా మారగలమా? నిజానికి, మనల్ని మనం మార్చుకోవడానికి, ముందుగా అది నిజంగా సాధ్యమేనని మనం నమ్మాలి. "నేను ఇలానే ఉంటాను, అంతే: మారడానికి నేను ఏమీ చెయ్యలేను, కాబట్టి నేను అలాగే ఉండాలి" అని చెప్పే వ్యక్తులను మనం తరచుగా చూస్తుంటాం. లేదా "నేను ఎక్కువ కోపం ఉన్న వ్యక్తిని, నాకు బ్యాడ్ టెంపర్ ఉంది ఇంక నేను ఇలానే ఉంటాను" అని అంటూ ఉంటారు. మనం దేనితోనైనా అంత బలంగా నమ్ముకుంటే, సహజంగానే మనం మారడం కష్టంగా ఉంటుంది.

మనల్ని మనం నిజాయితీగా ఉంచుకోవాలి. కొన్ని విషయాలతో మనం ఎందుకు ఐడెంటిఫై అవ్వాలి? మనం నిజంగానే కోపం ఉన్న వ్యక్తి అయితే, ఎప్పుడూ కోపంగానే ఎందుకు ఉండాలి? మనం ఇతరులను నిందించవచ్చు: మా అమ్మ మరియు నాన్న వల్ల నాకు కోపం వస్తుంది అని అనొచ్చు. ఇది నిజంగా అసలు మనకు ఏమీ సహాయపడదు. మనం లోతుగా పరిశీలిస్తే అసలు ఈ భావోద్వేగాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. "కోపగించుకోకు, అత్యాశపడకు, స్వార్థపరుడిలా ఉండకు" అని ప్రతిరోజూ మనకు మనమే చెప్పుకున్నా, నిజానికి దాన్ని ఆపడం చాలా కష్టం, అవునా కాదా? కాబట్టి, మనం భావోద్వేగంగా అనుకునే విధానాన్ని మార్చడానికి అనుమతించే ఒక పద్ధతిని వెతకాలి.

మన వైఖరి అన్నిటినీ ప్రభావితం చేస్తుంది

మన భావోద్వేగ స్థితికి ఆధారమైనది మన "ఆలోచనా విధానం" అని బౌద్ధమతం చెబుతుంది. దీని అర్థం మనం విషయాలను చూసే విధానం అని. మనకు ఉద్యోగం పోయిందని అనుకుందాం. దీన్ని ఒక విపత్తుగా భావించి, ఆ తర్వాత కోపం, డిప్రెషన్ కి గురవుతాం. ఇలా మనం ఎందుకు చేస్తాం? ఎందుకంటే ఆ సమయంలో ఇది ప్రపంచంలో జరిగే అత్యంత చెడ్డ విషయం అని మనం అనుకున్నాం కాబట్టి.

మన ఉద్యోగం పోయింది - అది నిజమే. దాన్ని మనం మార్చలేం. కానీ ఆ ఉద్యోగం పోయినందుకు మనం భావించే విధానాన్ని మార్చగలం, అదే మన ఆలోచనా విధానం. కాబట్టి, మనం దానిని డిఫరెంట్ గా చూడటానికి ప్రయత్నించాలి - మనం ఇప్పుడు మన పిల్లలతో ఎక్కువ సమయం గడపవచ్చు అని లేదా వేరే జాబ్ కి మారడం గురించి ఆలోచించవచ్చు. సరే, ఇది మనకు ఆర్థికంగా సహాయపడకపోవచ్చు, కానీ దాని గురించి మనం బ్యాడ్ గా ఫీల్ అవ్వకుండా ఉంటాము. కాబట్టి, ధ్యానంలో మనం దృష్టి పెట్టగలిగేది ఇదే - మనం విషయాలను ఎలా పరిగణిస్తామనేది ముఖ్యం. ఎందుకంటే ఇదే మన అనుభూతిని ప్రభావితం చేస్తుంది.

నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు గత వారం చనిపోయాడు. ఇది చాలా బాధాకరం. నేను ఆ న్యూస్ విని చాలా బాధ పడ్డాను - అది ఆరోగ్యకరమైనదే; అందులో తప్పేమీ లేదు. అతను చనిపోయినందుకు నేను సంతోషంగా లేను! కానీ ఇక్కడ ఇలాంటి నా మానసిక స్థితితో నేను ఎలా పనిచెయ్యగలను? అతను చనిపోయే ఒక వారం ముందు, నాకు అతనికి కాల్ చెయ్యాలని అనిపించింది, కానీ నేను చెయ్యలేదు. అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉంది, స్నానం చేయడానికి వెళ్ళి గుండెపోటు వచ్చి అక్కడే మరణించాడు. ఇది పూర్తిగా ఊహించనిది మరియు చాలా ఆకస్మికమైనది. నిజానికి, ఒక వారం ముందు నేను అతనితో మాట్లాడనందుకు నాకు చాలా బాధ కలిగింది. లేదా అతను చనిపోతాడని తెలిస్తే నేను అతనితో చెప్పాలనుకున్న అన్ని విషయాల గురించి ఆలోచిస్తూ నాపై నేను కోపం తెచ్చుకోవచ్చు. ఇంక అదే ఆలోచిస్తూ ఉంటే నా ఫీలింగ్ మరింత దారుణంగా మారేది.

దానికి బదులుగా, మేము కలిసి గడిపిన అన్ని సంతోషకరమైన సమయాలను, చేసిన అద్భుతమైన విషయాలను గుర్తుచేసుకున్నాను - మేము 35 సంవత్సరాలుగా స్నేహితులుగా ఉన్నాము - ఇంత అద్భుతమైన వ్యక్తిని కలుసుకోవడం నాకు ఎంతో అదృష్టం. నాకు తెలిసిన పాశ్చాత్యులలో అతనే అత్యంత నిజాయితీగల, ప్రామాణికమైన ధర్మ అభ్యాసకుడు. నా స్వంత అభ్యాసాన్ని మరింత బలంగా కొనసాగించడానికి అతను నాకు గొప్ప ప్రేరణ అని నేను భావిస్తాను. అతను తన భార్యను చూసుకున్నట్లే, నేను కూడా ఇప్పుడు అలానే ఉంటున్నానని తెలిస్తే అతను చాలా సంతోషపడతాడని నాకు తెలుసు. నేను కూడా అలానే ఉన్నాను.

ఇది ధ్యానం యొక్క ఫలితం. మీరు అతీంద్రియ శక్తులను లేదా దీనికి మించి అసాధారణమైన వేటినీ ఇంక పొందలేరు. మీకు ఒక కష్టమైన పరిస్థితిని వచ్చినప్పుడు, ఒక నెగెటివ్, అసంతృప్తికరమైన మానసిక స్థితికి చేరుకున్నప్పుడు, ఆ పరిస్థితిని పాడవ్వకుండా ఉంచడానికి మీకు సరైన అవగాహన ఉంటుంది. ఈ కష్టమైన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మనం మంచి మార్గాలను వెతుకుతాము మరియు తగిన శిక్షణతో, మనం విషయాలను చూసే విధానాన్ని పూర్తిగా మార్చగలుగుతాము. నేను నా స్నేహితుడిని కోల్పోయినప్పుడు ఉన్న బాధని ఇప్పటికీ అనుభవించవచ్చు, కానీ ఆ బాధని తగ్గించుకోవడానికి ఆనందాన్ని తెచ్చిపెట్టే పనులను చెయ్యాల్సి ఉంటుంది.

మన సామర్థ్యంపై నమ్మకం కలిగి ఉండటం

మనం విషయాలను చూసే విధానాన్ని మార్చగలమా లేదా అనే ప్రశ్నకు సమాధానం అవును అని వస్తుంది. చిన్నప్పుడు మనకు చాలా ఆసక్తికరంగా, అద్భుతంగా అనిపించినవి ఇప్పుడు చాలా సిల్లీగా, మూర్ఖంగా మరియు బోరింగ్ గా అనిపిస్తాయి. మన వయసు పెరిగే కొద్దీ మన ఆలోచనలు మారిపోతాయి. మనం ఇంక మారడం సాధ్యమేనని మనకు నమ్మకం వచ్చినప్పుడు, అలా చేయడానికి మనం కొన్ని పద్ధతులను నేర్చుకోవాలి. దీనికి మూడు దశలు ఉన్నాయి:

  • సరైన సమాచారాన్ని పొందడం - ఒక దాని గురించి వినడం, చదవడం లేదా నేర్చుకోవడం వల్ల వచ్చే ప్రయోజనకరమైన అలవాట్ల గురించి మనం తెలుసుకోవాలి. ఈ దశ మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలని కాదు, కానీ ఇది బౌద్ధమత పద్ధతి అని మనకు తెలుస్తుంది.
  • దాని అర్థాన్ని ఆలోచించడం - మనం పొందిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. దాని గురించి ఆలోచించి వివిధ కోణాల నుంచి విశ్లేషించాలి, అప్పుడు మనం దానిని అర్థం చేసుకోగలం. మనం చేస్తున్నది వృధా కాదని, అదే నిజమని గ్రహించాలి. ఇది మనకు ప్రయోజనకరంగా ఉంటుందని, దానిని మన జీవితంలో ఉపయోగించుకోగలమని కూడా మనం నమ్మాలి.
  • ధ్యానం చెయ్యడం - ఇప్పుడు మనం నేర్చుకున్న మరియు అర్థం చేసుకున్న వాటిని ఒక ప్రయోజనకరమైన అలవాటుగా చేసుకోవడానికి ధ్యానం చెయ్యాలి.

సరైన సమాచారం మరియు ఆలోచన

సరైన సమాచారం పొందడం మనం అనుకున్నంత సులభమేమీ కాదు. ప్రామాణిక బౌద్ధ పద్ధతులను బోధిస్తున్నామని చెప్పుకునే వారు మన చుట్టూ చాలా మంది ఉన్నారు; కానీ ఎవరైనా ఒక పుస్తకం రాసి దాన్ని ప్రచురించినంత మాత్రాన ఆ పుస్తకంలోని విషయాలు సరైనవని కాదు. ఒక ఉపాధ్యాయుడు చాలా ప్రజాదరణ పొందినవాడు లేదా గొప్పవాడు అయినంత మాత్రాన, అతను బోధించేది ప్రతీదీ సరైనది కాదు. హిట్లర్ చాలా ఫేమస్ మరియు చాలా ప్రజాదరణను పొందినవాడు, కానీ అతను బోధించినది ఏదీ సరైనది కాదు.

కాబట్టి, బౌద్ధమతంలో, మన తెలివితేటలను ఉపయోగించాలని నొక్కి చెప్పబడింది. ఇదే మనల్ని జంతువుల నుంచి వేరు చేస్తుంది? ఒక జంతువుకు అనేక పనులు చేయడానికి శిక్షణ ఇవ్వవచ్చు, కానీ వాటికి లేనిది మనకు ఉన్నది తెలివితేటలే. ఏది సహాయకారిగా ఉంటుందో, ఏది కాదో అని మనం గుర్తించగలుగుతాం. మొదట్లో మనకు ఏదైనా అర్థం కాకపోయినా, మన తెలివితేటలను ఉపయోగించి ఎలాగోలా ఆ పనిని చెయ్యవచ్చు, టీచింగ్స్ విన్నప్పుడు లేదా చదివేటప్పుడు మనం సరిగ్గా అదే చేయాలి.

బుద్ధుడు బోధించిన ప్రతిదీ ఇతరులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ఉంటుంది. కానీ ఆయన బోధించిన విషయాలు ప్రయోజనకరంగా ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకోవచ్చు. దీని కోసం, మనం దీర్ఘకాలిక ప్రభావాలను కూడా చూడాలి, ఎందుకంటే స్వల్పకాలిక ప్రభావాలు అంత మంచిగా ఉండకపోవచ్చు. ఇది కొన్ని వైద్య చికిత్సల లాగా ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ కు కీమోథెరపీ లాంటి దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుంది.

పై వాటిని పరిశీలించి, మన జీవితాలతో, మన స్వంత అనుభవాలతో ముడిపెట్టకపోతే, మనం దాని గురించి ఎలా ధ్యానం చెయ్యగలం? మనకేదైనా అవసరమా లేదా, అసలు అది నిజంగా మంచిదేనా అని ఆలోచించకుండా కొనడం లాంటిది.

అధికారిక ధ్యానం

అవును, బోధనల గురించి ఆలోచించే ప్రాసెస్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, కొంతమంది ఇప్పటికే దీనిని ధ్యానం యొక్క రూపం అని కూడా పిలుస్తున్నారు. కానీ మనం మరింత అధికారికంగా పిలిచే ఈ "ధ్యానం" ప్రయోజనకరమైన మానసిక స్థితిని మన జీవన విధానంలో, మన జీవితాలలో కలుపుకునే ఒక ప్రక్రియ. ఇది రెండు దశలను కలిగి ఉంటుంది:

  • విచక్షణాత్మక ధ్యానం - ఈ మొదటి దశ "విశ్లేషణాత్మక ధ్యానం" అని పిలవబడుతుంది మరియు ఇక్కడ మనం మెరుగైన ఆలోచనతో దృష్టి కేంద్రీకరిస్తాము, ఇందులోని అన్ని వివరాలను మరియు సహాయక కారణాలను వివరంగా ఆలోచిస్తాము.
  • ధ్యానాన్ని స్టెబిలైజ్ చెయ్యడం - రెండవ దశలో మనం ఇకపై అన్ని వివరాలను చురుకుగా తెలుసుకోలేము, కానీ మన విశ్లేషణ యొక్క ఆలోచనతో వాటిపై సంకుచిత పద్ధతిలో దృష్టి కేంద్రీకరిస్తాము.

చాలా మంది ధ్యానాన్ని మొదలుపెట్టినప్పుడు, శ్వాసపై దృష్టి పెట్టడం నేర్చుకుంటారు. మనం మన మనస్సును శాంతపరిచి, లోపలికి మరియు బయటకు వెళ్ళే శ్వాసపై దృష్టి పెడతాము. ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుంది కాని నిజానికి అలా చెయ్యడం చాలా కష్టం. శ్వాసపై దృష్టి పెట్టి మనం ఏం చెయ్యడానికి ప్రయత్నిస్తాము? ముందుగా, మన మనస్సులోని ధ్వనిని శాంత పరచడానికి మనం ప్రయత్నిస్తాము, ఎందుకంటే అది మనకు అన్ని రకాల ఇబ్బంది పెట్టే శబ్దాలను ప్లే చేస్తూ ఉంటుంది. ఇది బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న నాయిస్ ని వదిలించుకోవడం లాంటిది. కానీ అదే సమయంలో, మనం విన్న, ఆలోచించిన మరియు అర్థం చేసుకున్న వాటి గురించి కొంత అవగాహనతో శ్వాసపై దృష్టి పెట్టవచ్చు. ఇక్కడే విచక్షణ మరియు స్థిరమైన ధ్యానం వస్తుంది. ఉదాహరణకు, శ్వాసను మనం అశాశ్వతానికి ఒక ఉదాహరణగా పరిగణించవచ్చు: ఇది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. లేదా శ్వాసలో ప్రత్యేకమైన "నేను" అనేది లేదు అనే నిజాన్ని మనం తెలుసుకోవచ్చు - అన్నింటికీ మించి, ఎవరు శ్వాసను తీసుకుంటున్నారు? అని. కానీ అలాంటి విశ్లేషణ ప్రారంభకులకు కొంచెం కష్టంగానే ఉంటుంది.

మళ్ళీ మన గురించి మనమే ఆలోచించుకోవడం మంచి విషయం. మన పని, కుటుంబాలు మరియు సమాజం నుంచి మనం ఎప్పుడూ చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటాము - అందుకని మన మనస్సులు ఎప్పుడూ ఆందోళనలు మరియు సమస్యాత్మక ఆలోచనలతో నిండి ఉంటాయి. రిలాక్స్ అవ్వడం చాలా కష్టం! కాబట్టి, మనకు, పూర్తిగా రిలాక్స్ గా ఉండటం మరియు బాగా స్థిరంగా ఉండటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయినా కానీ ఇది మన సమస్యలను పరిష్కరించదు, ఇది కేవలం మొదటి స్టెప్ మాత్రమే. మన శ్వాసపై దృష్టి పెట్టి మన శరీరాల వాస్తవికత గురించి తెలుసుకోవచ్చు - "నేను బతికే ఉన్నాను!" శ్వాస దానికి సరైన సూచన ఎందుకంటే అది మనం చనిపోయే వరకు కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి. మన జీవితం ఎంత కష్టమైనా శ్వాస ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. దాని గురించి మనం ఇంకా తెలుసుకోగలిగితే, అది జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు; ఏది ఏమైనా కానీ, జీవితం కొనసాగుతూనే ఉంటుంది. నా స్నేహితుడు చనిపోయినప్పుడు కూడా అంతే, ఎందుకంటే జీవితాన్ని నేను అర్థం చేసుకున్నాను, ఇది ఇలా సాగుతూనే ఉంటుంది అని.

కాబట్టి, మన దగ్గర ఈ సమాచారం ఉంది, మనం దీని గురించి ఆలోచించి అర్థం చేసుకున్నాము. ఇది అర్థవంతంగా ఉందని నమ్ముతున్నాము. జీవితం అలా కొనసాగుతూ, నా శరీరంతో ఎక్కువగా కనెక్ట్ అయ్యి, భయంతో, నిస్పృహకు లోనైన ఆలోచనల్లో పూర్తిగా మునిగిపోకుండా ఉండటం ఉపయోగకరంగా ఉంటుంది. నా శ్వాస గురించి నేను ఏకాగ్రతను మరియు అవగాహనను కలిగి ఉండగలనా? అవును, మనం మన ఇతర పనులను ఒకటి లేదా రెండు సెకన్ల పాటు ఆపివేసినా, మన శ్వాసను మనం గమనించవచ్చు: ఇది ఎప్పుడూ అలానే ఉంటుంది. అందుకని, మనకు చాలా లోతైన లేదా అధునాతన స్థాయి లాంటి అవగాహన కూడా అవసరం లేదు. నిజానికి, ఇది ఎంత లోతుగా ఉంటే అంత మంచిది, కానీ మొదలుపెట్టడానికి ఇది సరిపోతుంది.

ధ్యాన ప్రక్రియ

మనకు రెండు మానసిక కారణాలు ఉన్నప్పుడు శ్వాసపై దృష్టి పెట్టడం గురించి మనకు ఒక అవగాహనకు వస్తుంది. ఇవి మన దృష్టితో పాటు వచ్చే మానసిక స్థితులు.:

  • స్పష్టంగా గుర్తించడం - స్పష్టంగా దేనినైనా గుర్తించడం.
  • సరిగ్గా జడ్జ్ చెయ్యడం - ఒక విషయాన్ని చాలా వివరంగా అర్థం చేసుకోవడం.

ఈ రెండు మానసిక స్థితుల మధ్య తేడాని వివరించడానికి ఉపయోగించే ఒక ఉదాహరణ పెయింటింగ్ ను చూడటం. స్పష్టంగా గుర్తించడంతో, బహుశా అది ఒకరి పెయింటింగ్ అని మనం గుర్తించవచ్చు. ఈ విషయం తెలుసుకోవడానికి మనసుకు ఎలాంటి సమాచారం అవసరం లేదు, కేవలం చూస్తే తెలిసిపోతుంది. దీన్నే మనం చాలా సాధారణ భాషలో "అవగాహన" అని అంటాం. సరిగ్గా జడ్జ్ చెయ్యడంతో, మనం ఆ పెయింటింగ్ ను వివరంగా పరిశీలించి ఇది ఆ వ్యక్తి యొక్క చిత్రం అని అర్థం చేసుకుంటాము. 

శ్వాసపై దృష్టి పెట్టేటప్పుడు కూడా మనం చేసేది ఇదే. శ్వాస అనేది ఎప్పుడూ జరిగే ఒక ప్రక్రియ అని అర్థం చేసుకుంటాము మరియు మన ముక్కు లోపలికి, బయటకి వెళ్ళే శ్వాసను మనం గుర్తిస్తాము. ఏమి జరిగినా, ఇది నేను జీవించి ఉన్నంత కాలం కొనసాగుతుంది, కాబట్టి ఆ అర్థంలో, ఇది స్థిరంగా, సురక్షితంగా మరియు నమ్మదగినదిగా అనిపిస్తుంది. అందుకే దీనిని మనం "విచక్షణాత్మక ధ్యానం" అని పిలుస్తాము. ఎందుకంటే ఇది మనం గమనించే విషయం. మనం దీనిని అనలైజ్ చెయ్యడం లేదు, కానీ ఒక నిర్దిష్ట కోణంలో చూస్తూ అర్థం చేసుకుంటున్నాం.

రెండవ దశ, ధ్యానాన్ని స్టెబిలైజ్ చెయ్యడం, ఇక్కడ మనం ఈ విధంగా చురుకుగా గుర్తించాల్సిన అవసరం లేదు, అది మనకు తెలుసు. ఇది ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి మరియు దానిని తెలుసుకోవడానికి మధ్య చాలా భిన్నమైన మానసిక స్థితి ఉంటుంది. మనం ధ్యానం చేస్తాము, మరియు దాని ఫలితం మనం ఎక్కువ స్థిరంగా మరియు సురక్షితంగా ఉంటాము. 

మన అభ్యాసాన్ని జీవితంలో అప్లై చెయ్యడం

ముఖ్యంగా, మనం బాగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ అభ్యాసాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తాము. నిజానికి, ఇది కష్టం, మరియు మనం ఇంతకు ముందే ఇలాంటి శారీరక శిక్షణ యొక్క అనాలజీని ఉపయోగించాము, కాని చివరికి, అవగాహన మనలో చాలా లోతుగా పాతుకు పోతుంది. అది మనకు ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది. జీవితం ఎప్పుడూ కొనసాగుతుందని మనకు తెలుసు. చాలా లోతైన స్థాయిలో, ఏమి జరిగినా, ఎటువంటి సమస్య ఉండదు. ఇది మనకు ఎంత లోతుగా తెలుసు అంటే అది మన జీవితాన్ని చూసే విధానాన్ని మార్చే అలవాటుగా ఉంటుంది. ఇదే ధ్యానం యొక్క ఫలితం. మనం దీన్ని మరచిపోతే, మన శ్వాసపై ఎప్పుడైనా దృష్టి పెట్టవచ్చు మరియు మనల్ని మనం గుర్తు చేసుకోవచ్చు మరియు రిఫ్రెష్ అవ్వొచ్చు. మనం చేసేది ఏమిటంటే, మన జీవితంతో ఎలా వ్యవహరిస్తామనే విషయంలో మన మానసిక స్థితిలో నిజమైన మార్పును తీసుకురావడం. ఏదో ఒక ఫాంటసీ లోకానికి వెళ్ళి మన సమస్యల నుంచి తప్పించుకోవడం కాదు, మన మానసిక మరియు భావోద్వేగ స్థితులను మెరుగుపరచడానికి మనం అనుసరించే ఒక ప్రక్రియ ఇది.

మనం దీనిని ఒక అధునాతనమైన సైకాలజీ పద్ధతిగా కూడా చూడవచ్చు. దీన్ని ఇలా చూడటం మంచిదే కానీ బౌద్ధమతం అంటే ఇదేనని అనుకోకూడదు. సైకాలజీ యొక్క మరొక రూపం లాగా. బౌద్ధమతం దీనికంటే చాలా ఎక్కువ స్థాయిని కలిగి ఉంటుంది. బౌద్ధమతంలో మనం దీనికంటే ఎక్కువ విషయాలను లక్ష్యంగా పెట్టుకున్నాము – అవే జ్ఞానోదయం, ప్రతి ఒక్కరికీ సహాయం చేయడం. కానీ మనం ఈ ముఖ్యమైన మొదటి స్టెప్ ను కూడా దాటాల్సి ఉంది.

సారాంశం

రోజంతా మ్యూజిక్ వింటూ బిజీగా ఉండకుండా, మన సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడం చాలా సులభం, తాగి అన్నిటినీ మర్చిపోవటానికి ప్రయత్నించకుండా ఇలా చేయొచ్చు. ఈ తాత్కాలిక పనులు అంతగా సహాయపడవు. ఆ సమస్యలు ఎప్పుడూ తిరిగి వస్తూనే ఉంటాయి. ధర్మం గురించి నిజంగా ఆలోచించి ధ్యానం చేయడం ద్వారా, మనల్ని, ఇతరులను మరియు మనం అనుభవించే వాటిని చూసే విధానాన్ని పూర్తిగా మార్చుకోగలుగుతాము. ఇది మన సమస్యలన్నీ వెంటనే పోయేలా చెయ్యదు కానీ, వాటిని ఎదుర్కోవటానికి మనకు తగినంత బలం ఉందని తెలుసుకునేలా చేస్తుంది. 

Top