పునర్జన్మ అంటే ఏమిటి?

ఇతర భారతీయ మతాల లాగానే, బౌద్ధమతం మళ్ళీ జన్మించడం లేదా పునర్జన్మ నిజంగా ఉందని చెప్తుంది. ఒక వ్యక్తి యొక్క మానసిక కొనసాగింపు, దాని ప్రవృత్తులు, ప్రతిభ మొదలైన వాటితో, గత జన్మల నుంచి వచ్చి భవిష్యత్తులోకి వెళుతుంది. ఒకరి పనులు మరియు వారు చేసుకున్న వాటిని బట్టి, ఒక వ్యక్తి వివిధ రకాల జీవ రూపాల్లో పునర్జన్మను పొందవచ్చు, మంచి లేదా అధ్వాన్నంగా ఉండవచ్చు: మానవుడు, జంతువు, కీటకాలు మరియు దెయ్యం మరియు ఇతర అదృశ్య స్థితులుగా. మమకారం, కోపం మరియు అమాయకత్వం లాంటి వారి ఇబ్బంది పెట్టే వైఖరుల శక్తి మరియు వాటి ద్వారా ప్రేరేపించబడిన వారి బలవంతపు ప్రవర్తన కారణంగా అన్ని జీవులు నియంత్రణలో లేని పునర్జన్మను అనుభవిస్తాయి. గత ప్రవర్తనా విధానాల కారణంగా మనస్సులో వచ్చే నెగెటివ్ ప్రేరణలను అనుసరిస్తే, వినాశకరమైన చర్యలకు పాల్పడితే, దాని ఫలితంగా బాధ మరియు అసంతృప్తిని అనుభవిస్తారు. మరోవైపు నిర్మాణాత్మక పనుల్లో నిమగ్నమైతే ఆనందాన్ని పొందుతారు. కాబట్టి, వరుస పునర్జన్మల్లో ప్రతి వ్యక్తి యొక్క ఆనందం లేదా దుఃఖం ప్రతిఫలం లేదా శిక్ష కాదు, కానీ ప్రవర్తనా కారణం మరియు ప్రభావం యొక్క నియమాల ప్రకారం ఆ వ్యక్తి యొక్క ఇంతకుముందు పనుల ద్వారా అది సృష్టించబడుతుంది.

పునర్జన్మను మనం ఎలా అర్థం చేసుకోవాలి?

ఏదైనా నిజం అని మనకు ఎలా తెలుస్తుంది? బౌద్ధమత బోధనల ప్రకారం, ఒక విషయాన్ని రెండు విధాలుగా తెలుసుకోవచ్చు: సూటిగా గ్రహించడం ద్వారా మరియు ఊహ ద్వారా. ఒక ప్రయోగశాలలో ఒక ప్రయోగం చేయడం ద్వారా, సూటిగా గ్రహించడం ద్వారా మనం ఏదైనా ఉనికిని ధృవీకరించవచ్చు. ఉదాహరణకు, ఒక మైక్రోస్కోప్ నుంచి చూడటం ద్వారా, సరస్సు నీటి చుక్కలో అనేక చిన్న సూక్ష్మజీవులు ఉన్నాయని మన ఇంద్రియాల ద్వారా మనకు తెలుస్తుంది.

అయితే కొన్ని విషయాలను సూటిగా తెలుసుకోవడం కుదరదు. ఉదాహరణకు, అయస్కాంతం మరియు ఇనుప సూది యొక్క ప్రవర్తనను అంచనా వెయ్యడానికి మనం లాజిక్, హేతుబద్ధత మరియు ఊహపై ఆధారపడాలి. పునర్జన్మను సూటిగా ఇంద్రియ అవగాహన ద్వారా నిరూపించడం చాలా కష్టం. ఏదేమైనా, వారి గత జీవితాలను గుర్తుంచుకునే మరియు వారి వ్యక్తిగత వస్తువులను లేదా వారికి ఇంతకు ముందు తెలిసిన వ్యక్తులను గుర్తించగల వ్యక్తులకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. పునర్జన్మ ఉనికిని మనం ఊహించవచ్చు, కాని కొంతమంది ఈ నిర్ధారణను అనుమానించవచ్చు మరియు ఒక ట్రిక్ ని అనుమానించవచ్చు.

గత జన్మ జ్ఞాపకాలను పక్కన పెడితే పునర్జన్మను అర్థం చేసుకోవడానికి లాజిక్ వైపు మనం వెళ్లవచ్చు. కొన్ని అంశాలు రియాలిటీకి అనుగుణంగా లేకపోతే వాటిని బౌద్ధమతం నుంచి తొలగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని దలైలామా గారు చెప్పారు. ఇది పునర్జన్మకు కూడా వర్తిస్తుంది. నిజానికి ఆ సందర్భంలోనే ఆయన ఈ మాటను చెప్పారు. పునర్జన్మ లేదని శాస్త్రవేత్తలు నిరూపించగలిగితే, అది నిజమని నమ్మడం మనం మానుకోవాలి. ఏదేమైనా, శాస్త్రవేత్తలు దానిని తప్పు అని నిరూపించలేకపోతే, వారు లాజిక్ ని మరియు కొత్త విషయాలను అర్థం చేసుకోవడానికి ఉంచిన శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తారు కాబట్టి, వారు అది ఉందో లేదో పరిశోధించాలి. పునర్జన్మ లేదని నిరూపించడానికి, వారు దాని ఉనికిని కనుగొనవలసి ఉంటుంది. "నా కళ్లతో చూడలేను కాబట్టి పునర్జన్మ లేదు" అని చెప్పినంత మాత్రాన పునర్జన్మ ఉనికి కనిపించదు. అయస్కాంతం మరియు గురుత్వాకర్షణ లాంటి మన కళ్లతో చూడలేని అనేక విషయాలు ఉన్నాయి.

పునర్జన్మ ఉందా లేదా అని పరిశోధించడానికి కారణ మార్గాలు

పునర్జన్మ ఉనికిని శాస్త్రవేత్తలు నిరూపించలేకపోతే, పునర్జన్మ నిజంగా ఉందా లేదా అని పరిశోధించాల్సిన అవసరం ఉంటుంది. శాస్త్రీయ పద్ధతి ఏమిటంటే నిర్దిష్ట డేటా ఆధారంగా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం మరియు తర్వాత దాన్ని ధృవీకరించవచ్చో లేదో చెక్ చేసుకోవడం. అందువల్ల, మనం ఈ డేటాను పరిశీలిస్తాము. ఉదాహరణకు, శిశువులు ఖాళీ క్యాసెట్ల లాగా జన్మించకపోవడాన్ని మనం గమనించాము. వీరు చాలా చిన్న వయసులో కూడా గమనించదగిన కొన్ని అలవాట్లు మరియు వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి?

అవి కేవలం తల్లిదండ్రుల శారీరక పదార్ధాల మునుపటి కొనసాగింపుల నుంచి, వీర్యం మరియు అండం నుంచి వచ్చారని చెప్పడంలో అర్థం లేదు. ప్రతి వీర్యం మరియు అండం కలిసి పిండంగా ఎదగడానికి గర్భంలో అమర్చబడవు. వారు శిశువుగా మారినప్పుడు మరియు వారు అలా మారనప్పుడు మధ్య ఉండే తేడా ఏమిటి? పిల్లలలో వివిధ అలవాట్లు మరియు ప్రవృత్తులకు అసలు కారణమేమిటి? అది డీఎన్ఏ (DNA), జన్యువులు అని చెప్పొచ్చు. ఇది ఫిజికల్ సైడ్. ఒక బిడ్డ ఎలా పుట్టాడనే భౌతిక కోణం ఇదేనని అందరూ చెప్తారు. అయినప్పటికీ, అనుభవపూర్వక వైపు గురించి ఆలోచిస్తే ఏమిటి? మనసు గురించి ఎలా ఆలోచించాలి?

"మనస్సు" అనే ఆంగ్ల పదానికి సంస్కృత మరియు టిబెటన్ పదాల మాదిరిగానే అర్థం లేదు. మూల భాషలలో, "మనస్సు" అనేది మానసిక కార్యాచరణ లేదా మానసిక సంఘటనలను సూచిస్తుంది, ఆ పనిని చేసేదానికి బదులుగా. కార్యాచరణ లేదా సంఘటన అనేది కొన్ని విషయాల యొక్క అభిజ్ఞా ఉత్పన్నం - ఆలోచనలు, దృశ్యాలు, శబ్దాలు, భావోద్వేగాలు, భావాలు మొదలైనవి - మరియు వాటితో అభిజ్ఞా ప్రమేయం - వాటిని చూడటం, వినడం, వాటిని అర్థం చేసుకోవడం మరియు వాటిని అర్థం చేసుకోకపోవడం.

ఒక వ్యక్తిలోని అభిజ్ఞా వస్తువులతో ఉద్భవించడం మరియు నిమగ్నం కావడం యొక్క ఈ మానసిక చర్య ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ, దేహం ఎక్కడ నుంచి వస్తుందనే దాని గురించి మనం మాట్లాడటం లేదు, ఎందుకంటే అది స్పష్టంగా తల్లిదండ్రుల నుంచే వస్తుంది. మనం తెలివితేటలు మొదలైన వాటి గురించి మాట్లాడటం లేదు, ఎందుకంటే దానికి జన్యుపరమైన ఆధారం ఉందనే వాదనను కూడా మనం ఇవ్వవచ్చు. ఏదేమైనా, చాక్లెట్ ఐస్ క్రీమ్ కోసం ఎవరైనా ప్రాధాన్యత వ్యక్తి యొక్క జన్యువుల నుంచి వచ్చిందని చెప్పడం చాలా దూరం సాగదీయడం లాంటిదే.

మన ఆసక్తులు కొన్ని మన కుటుంబాల ద్వారా లేదా మనం ఉన్న ఆర్థిక లేదా సామాజిక పరిస్థితులచేత ప్రభావితమవుతాయని చెప్పవచ్చు. ఈ విషయాలు ఖచ్చితంగా ప్రభావాన్ని చూపుతాయి, కానీ ఆ విధంగా మనం చేసే ప్రతి దాన్ని ఖచ్చితంగా వివరించడం కష్టం. ఉదాహరణకు, నాకు చిన్నతనంలో యోగాపై ఆసక్తి ఎందుకు కలిగింది? నా కుటుంబంలో కానీ, నా చుట్టుపక్కల సమాజంలో కానీ ఎవరికీ అలాంటి ఆసక్తి లేదు. నేను నివసిస్తున్న ప్రాంతంలో కొన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, కాబట్టి సమాజం నుంచి కొంత ప్రభావం ఉందని మీరు చెప్పగలరు, కాని హథ యోగానికి సంబంధించిన ఆ నిర్దిష్ట పుస్తకంపై నాకు ఎందుకు ఆసక్తి కలిగింది? నేను ఎందుకు దాన్ని తీసుకున్నాను? అన్నది మరో ప్రశ్న. పనులు కేవలం యాదృచ్ఛికంగా జరుగుతాయా, కాబట్టి అదృష్టం ఆచరణలోకి వస్తుందా, లేదా ప్రతిదీ వివరించవచ్చా?

వ్యక్తిగత మానసిక కార్యకలాపాలు ఎక్కడ నుంచి వస్తాయి?

ఈ విషయాలన్నింటినీ పక్కన పెడితే, ప్రధాన ప్రశ్నకు మళ్ళీ చూద్దాం: అభిజ్ఞా వస్తువులు మరియు వాటిలో అభిజ్ఞా ప్రమేయం యొక్క కార్యాచరణ ఎక్కడ నుంచి వస్తుంది? గ్రహించే ఈ సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది? జీవజ్యోతి ఎక్కడి నుంచి వస్తుంది? స్పెర్మ్ మరియు అండం యొక్క ఈ కలయిక నిజానికి జీవితాన్ని కలిగి ఉండటానికి కారణమేమిటి? మనిషిగా మారడానికి కారణమేమిటి? ఆలోచనలు మరియు దృశ్యాలు ఉద్భవించడానికి అనుమతించేది ఏమిటి మరియు వాటితో అభిజ్ఞా ప్రమేయానికి కారణమేమిటి, ఇది మెదడు యొక్క రసాయన మరియు విద్యుత్ కార్యకలాపాల యొక్క అనుభవాత్మక భాగం?

శిశువు యొక్క మానసిక కార్యకలాపాలు తల్లిదండ్రుల నుంచి వస్తాయని చెప్పడం కష్టం, ఎందుకంటే అలా జరిగితే, అది తల్లిదండ్రుల నుంచి ఎలా వస్తుంది? ఇందులో ఏదో ఒక మెకానిజం ఉండాలి. వీర్యం, అండం మాదిరిగానే ఆ జీవిత స్పార్క్ - విషయాలపై అవగాహన కలిగి ఉంటుందా - తల్లిదండ్రుల నుంచి వస్తుందా? ఇది ఉద్వేగంతో వస్తుందా? అండోత్సర్గముతో? అది వీర్యంలో ఉందా? గుడ్డు? తల్లిదండ్రుల నుంచి ఎప్పుడు వస్తుందో తార్కికంగా, శాస్త్రీయంగా చెప్పలేకపోతే మరో పరిష్కారం వెతుక్కోవాలి.

పూర్తి తర్కంతో చూస్తే, క్రియాత్మక దృగ్విషయాలన్నీ వాటి స్వంత కొనసాగింపుల నుంచి, ఒకే రకమైన దృగ్విషయం యొక్క మునుపటి క్షణాల నుంచి వచ్చాయని మనం చూస్తాము. ఉదాహరణకు, ఒక భౌతిక దృగ్విషయం, అది పదార్థం లేదా శక్తి కావచ్చు, ఆ పదార్థం లేదా శక్తి యొక్క మునుపటి క్షణం నుంచి వస్తుంది. ఇది ఒక కొనసాగింపు.

కోపాన్ని ఉదాహరణగా తీసుకోండి. మనం కోపంగా ఉన్నప్పుడు అనుభవించే శారీరక శక్తి గురించి మాట్లాడవచ్చు, అది ఒక విషయం. ఏదేమైనా, కోపాన్ని అనుభవించే మానసిక చర్యను పరిగణించండి - భావోద్వేగం యొక్క ఉద్భవాన్ని అనుభవించడం మరియు దాని గురించి స్పృహ లేదా అపస్మారక అవగాహన. ఒక వ్యక్తి కోపాన్ని అనుభవించడం ఈ జన్మలో దాని స్వంత కొనసాగింపు క్షణాలను కలిగి ఉంటుంది, కానీ అది అంతకు ముందు ఎక్కడ నుంచి వచ్చింది? అది తల్లిదండ్రుల నుంచి రావాలి, అది ఎలా జరుగుతుందో వర్ణించడానికి యంత్రాంగం లేదు, లేదా అది సృష్టికర్త అయిన దేవుని నుంచి రావాలి. అయితే, కొంత మందికి, సర్వశక్తిమంతుడు ఒక సమస్యను ఎలా సృష్టిస్తాడనే వివరణలో లాజిక్ అసమానతలు కనిపిస్తాయి. ఈ సమస్యలను నివారించడానికి, ప్రత్యామ్నాయం ఏమిటంటే, ఎవరి జీవితంలోనైనా కోపం యొక్క మొదటి క్షణం దాని స్వంత మునుపటి క్షణం నుంచి వస్తుంది. పునర్జన్మ సిద్ధాంతం ఈ విషయాన్ని వివరిస్తుంది.

ఒక చలనచిత్రం యొక్క సారూప్యత

పునర్జన్మను సినిమా పోలికతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఒక సినిమా అనేది సినిమా ఫ్రేమ్ ల కొనసాగింపుగా ఉన్నట్లే, మన మానసిక కొనసాగింపులు లేదా మైండ్ స్ట్రీమ్ లు ఒక జీవితకాలంలో మరియు ఒక జీవితం నుంచి మరొక జీవితానికి సంఘటనల రూపంలో ఎప్పుడూ మారుతున్న అవగాహన యొక్క కొనసాగింపులు. పునర్జన్మ పొందే "నేను" లేదా "నా మనస్సు" లాంటి దృఢమైన, కనిపెట్టదగిన అస్తిత్వం ఉండదు. పునర్జన్మ అనేది కన్వేయర్ బెల్టుపై కూర్చొని ఒక జీవితం నుంచి ఇంకొక జీవితానికి వెళ్ళే ఒక చిన్న విగ్రహం లాంటిది కాదు. ఇది ఒక సినిమా వంటిది, ఇది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ వేరేగా ఉంటుంది, కానీ దానిలో కొనసాగింపు ఉంటుంది. ఒక ఫ్రేమ్ మరో ఫ్రేమ్ తో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అదే విధంగా, ఆ క్షణాలలో కొన్ని అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ, దృగ్విషయాల యొక్క అవగాహన యొక్క క్షణాల కొనసాగింపు ఎప్పుడూ మారుతూ ఉంటుంది. అంతేకాక, అన్ని సినిమాలు ఒకే సినిమాలా కాకుండా, అన్ని సినిమాలు అయినప్పటికీ, అన్ని మానసిక కొనసాగింపులు లేదా "మనస్సులు" ఒకే మనస్సు కాదు. దృగ్విషయాల యొక్క అవగాహన కొనసాగింపు యొక్క లెక్క లేనన్ని వ్యక్తిగత ప్రవాహాలు ఉన్నాయి మరియు ప్రతి దాన్ని దాని స్వంత ఆలోచన నుంచి "నేను" అని లేబుల్ చెయ్యవచ్చు.

పునర్జన్మ ప్రశ్నకు సంబంధించి మనం పరిశోధించే తార్కిక రేఖలు ఇవి. ఒక సిద్ధాంతం తార్కికంగా అర్థవంతంగా ఉంటే, వారి పూర్వ జన్మలను గుర్తుంచుకునే వ్యక్తులు ఉన్నారనే నిజాన్ని మనం ఇంకా తీవ్రంగా చూడవచ్చు. ఈ విధంగా, పునర్జన్మ ఉనికిని హేతుబద్ధమైన విధానం నుంచి పరిశీలిస్తాము.

పునర్జన్మ దేనిని కోరుకుంటుంది?

బౌద్ధమతం ప్రకారం, పునర్జన్మ యొక్క సారూప్యత ఒక కాంక్రీట్ చిన్న విగ్రహం లేదా వ్యక్తి లాగా, ఒక జన్మ నుంచి మరొక జీవితానికి కన్వేయర్ బెల్ట్ పై ప్రయాణించే ఒక ఆత్మ యొక్క పోలిక కాదు. కన్వేయర్ బెల్ట్ కాలాన్ని సూచిస్తుంది మరియు అది సూచించే ప్రతిబింబం ఏదో ఘనమైన వస్తువును సూచిస్తుంది, "నేను" అని పిలువబడే ఒక స్థిరమైన వ్యక్తిత్వం లేదా ఆత్మ కాలాన్ని దాటుతుంది: "ఇప్పుడు నేను చిన్నవాడిని, ఇప్పుడు నేను వృద్ధుడిని; ఇప్పుడు నేను ఈ జన్మలో ఉన్నాను, ఇప్పుడు నేను ఆ జన్మలో ఉన్నాను." ఇది పునర్జన్మ అనే బౌద్ధమత భావన కాదు. దాని పోలిక ఒక సినిమా లాగా  ఉంటుంది. ఒక సినిమాలో కంటిన్యూటీ ఉంటుంది. ఫ్రేమ్ లు ఒక కంటిన్యూయమ్ ను ఏర్పరుస్తాయి.

నేను నువ్వు అవుతానని, మనమంతా ఒక్కటేనని బౌద్ధం చెప్పలేదు. మనమందరం ఒకటే అయితే, నేను మీరైతే, మనిద్దరం ఆకలితో ఉంటే, నేను తినడానికి వెళ్ళినప్పుడు మీరు కారులో వేచి ఉండవచ్చు. అది అలా కాదు. మనలో ప్రతి ఒక్కరికి మన స్వంత కొనసాగింపు ప్రవాహాలు ఉన్నాయి. నా సినిమాలోని సన్నివేశం మీ సినిమాగా మారదు, కానీ మన జీవితాలు నిర్దిష్టమైనవి కావు, స్థిరమైనవి కావు అనే అర్థంలో సినిమాల్లా సాగిపోతాయి. జీవితం ఒక ఫ్రేమ్ నుంచి మరో ఫ్రేమ్ కు సాగుతుంది. ఇది కర్మ ప్రకారం ఒక క్రమాన్ని అనుసరిస్తుంది, అలా ఒక కొనసాగింపును ఏర్పరుస్తుంది.

ప్రతి కొనసాగింపు ఎవరో ఒకరు మరియు దాన్ని "నేను" అని పిలవవచ్చు; ప్రతి కొనసాగింపు ఎవరూ కాదని కాదు. కానీ ఒక సినిమా టైటిల్ మొత్తం సినిమాను, అందులోని ప్రతి ఫ్రేమ్ ను సూచిస్తుంది, కానీ ప్రతి ఫ్రేమ్ లో ఏదో కాంక్రీట్ గా కనిపించదు, అదే విధంగా "నేను" అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక కొనసాగింపును మరియు దాని యొక్క ప్రతి క్షణాన్ని సూచిస్తుంది, కానీ ఏ క్షణంలోనైనా ఒక నిర్దిష్టమైనదిగా కనుగొనబడదు. ఏదేమైనా, సాంప్రదాయకంగా ఒక "నేను", ఒక "ఆత్మ" ఉంది. బౌద్ధమతం ఒక నిహిలిస్టిక్ వ్యవస్థ కాదు.

మానవులు ఎప్పుడూ మానవులుగా పునర్జన్మను పొందుతారా?

ఇక్కడ మనం మాట్లాడేది మానసిక కార్యాచరణ గురించి మరియు మన మానసిక కార్యకలాపాలను వర్గీకరించే సాధారణ కారకాలు ఏమిటి. మానవ మానసిక పని యొక్క లక్షణం తెలివితేటలు, మరియు మనకు తెలిసినట్లుగా, తెలివితేటలు "చాలా తెలివైనవి కావు" నుంచి "చాలా తెలివైనవి" వరకు పూర్తి స్థాయిలో ఉండవచ్చు. కానీ మానసిక పనులలో భాగమైన ఇతర విషయాలు కూడా ఉన్నాయి, ఉదాహరణకు, కోపం, దురాశ, అనుబంధం, పరధ్యానం మరియు ఈ మానసిక కారకాల వల్ల కలిగే బలవంతపు ప్రవర్తనలు. కొంతమందిలో, ఈ కారకాలు వారి మానసిక కార్యకలాపాలను ఆధిపత్యం చేస్తాయి, అలా వారు వారి మానవ మేధస్సును ఉపయోగించరు, దానికి బదులుగా ఎక్కువగా దురాశ, కోపం మొదలైన వాటి ఆధారంగా పనిచేస్తారు.

ఉదాహరణకు, విపరీతమైన లైంగిక వాంఛ ఉంది బార్లలో తిరగడం, ఇతరులను కలవడం మరియు వారు కలుసుకున్న ఎవరితోనైనా శృంగారంలో పాల్గొనడం - ఒక కుక్కలా ప్రవర్తిస్తాడు, కదా? ఒక కుక్క తాను కలుసుకున్న ఏ ఇతర కుక్కతోనైనా, ఏ సమయంలోనైనా శృంగారంలో పాల్గొంటుంది; అది ఏ మాత్రం సొంత నియంత్రణను పాటించదు. ఒక మనిషి అలా ప్రవర్తిస్తే జంతు మనస్తత్వం అలవర్చుకుంటాడు. కాబట్టి, పునర్జన్మ పరంగా ఆలోచిస్తే, ఆ వ్యక్తి యొక్క కోరిక మనస్తత్వం భవిష్యత్తు జీవితంలో వారు కలిగి ఉండే మానసిక చర్య యొక్క ఆధిపత్య పద్ధతిగా ఉంటుంది మరియు వారు ఆ మానసిక కార్యకలాపాలకు తగిన ఆధారం అయిన శరీరంలో పునర్జన్మను పొందుతారు, అంటే జంతువుగా పునర్జన్మను పొందుతారు.

కాబట్టి మన ప్రవర్తనను పరిశీలించడానికి ఇది చాలా సహాయకారిగా ఉంటుంది: "నేను ఇలా ప్రవర్తిస్తున్నానా లేదా ఆ రకమైన జంతువులా ప్రవర్తిస్తున్నానా?" అని ఈగ పరంగా ఆలోచించండి. ఈగ మనస్తత్వం అంటే పూర్తిగా మానసిక సంచారం. ఒక ఈగ కొన్ని క్షణాల కంటే ఎక్కువసేపు ఒక ప్రదేశంలో ఉండలేదు; ఇది ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది మరియు ఎప్పుడూ దృష్టి మార్చుకుంటూ ఉంటుంది. ఈగ మనసులా మన మనసు ఉంటుందా? అలాగైతే, రాబోయే జన్మలో మనం ఏమి ఆశిస్తాము? మనం తెలివిగా, మంచి ఏకాగ్రతతో ఉంటామని ఆశిస్తామా?

మానవులు మానవులుగానే పునర్జన్మ పొందాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవడానికి సహాయపడే కొన్ని ఆలోచనలు ఇవి. మనం అనేక రకాల జీవరాశులుగా పునర్జన్మ పొందవచ్చు, మరియు అది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఒక మనిషిగా మనం ఎన్నో పాజిటివ్ అలవాట్లను పెంపొందించుకుంటే, మనం జంతువుగా పునర్జన్మ పొందినా, మన మునుపటి జంతు ప్రవర్తన యొక్క కర్మ శక్తి క్షీణించినప్పుడు, మన మునుపటి పాజిటివ్ శక్తి ఆధిపత్యం వహించవచ్చు మరియు మనం తిరిగి మానవునిగా పునర్జన్మను పొందవచ్చు. మనకు ఎప్పటికీ తక్కువ పునర్జన్మలు రావడాన్ని ఖండించలేం.

ఇక్కడ విషయం ఏమిటంటే, మానసిక చర్యలో అంతర్లీనంగా మానవ మానసిక చర్యగా లేదా అది మగ లేదా ఆడ లేదా అలాంటిదేదీ లేదని అర్థం చేసుకోవాలి. ఇది కేవలం మానసిక కార్యకలాపం మాత్రమే. కాబట్టి మనకున్న ఈ పునర్జన్మ రకం కర్మపై, మన బలవంతపు ప్రవర్తన ద్వారా మనం పెంపొందించుకునే వివిధ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. రాబోయే జన్మలలో, ఆ అలవాట్లను అమలు చెయ్యడానికి తగిన ప్రాతిపదికగా పనిచేసే శరీరం మనకు ఉంటుంది.

సారాంశం

పునర్జన్మ యొక్క బౌద్ధమత సమర్పణను మనం హేతుబద్ధంగా పరిశీలిస్తున్నప్పుడు, వ్యక్తిగత మానసిక కొనసాగింపులను శాశ్వతం చేసే కారణ ప్రక్రియను మనం పరిశీలించాలి: మానసిక కార్యకలాపాల యొక్క వ్యక్తిగత కొనసాగింపులు ఎప్పటికీ క్షీణించవు. ప్రారంభరహిత పునర్జన్మ అనేది మనం చేరుకునే ముగింపు, దాని స్వంత మునుపటి నిర్మిత ప్రవర్తనా అలవాట్లు ప్రతి జీవితకాలాన్ని తయారుచేస్తాయి.

Top