మైండ్ ట్రైనింగ్ ద్వారా సొంత పరివర్తన

27:36
మన౦ కష్టమైన పరిస్థితులను ఎదుర్కున్నప్పుడు, మరియు మన జీవితాల్లో విషయాలు చేదుగా మారినప్పుడు, వాటి పట్ల మన ఆలోచనలను మార్చుకోగలిగితే, ఆ అనుభవాలను మన ఆధ్యాత్మిక పురోగతిని పె౦పొ౦ది౦చే విధంగా మార్చుకోగలుగుతా౦. టిబెటన్ సంప్రదాయం "లోజాంగ్" అనే మైండ్ ట్రైనింగ్, మన జీవితంలోని సవాళ్లను మంచిగా హ్యాండిల్ చెయ్యడానికి వీలు కల్పించే వివిధ రకాల ప్రయోజనకరమైన ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడానికి మనకు శిక్షణ ఇస్తుంది.

"మైండ్ ట్రైనింగ్" అనేది ఒక వ్యక్తిని లేదా పరిస్థితి గురించి మనం చూసే విధానాన్ని మార్చే పద్ధతులను సూచిస్తుంది. ఏదేమైనా, "మనస్సు శిక్షణ" అనే పదం గురించి మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తిలో శిక్షణను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి దాని అర్ధం అది కాదు. బుద్ధి శిక్షణకు టిబెటన్ పదం, బ్లో- స్బయోంగ్, బ్లో అనే పదం కేవలం "మనస్సు" మాత్రమే కాదు. ఈ పదానికి "యాటిట్యూడ్" అనే అర్థం ఎక్కువగా ఉంటుంది. టిబెటన్ భాషలో స్బయోంగ్, "శిక్షణ" అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి: "శుభ్రపరచడం," దీనితో మీరు నెగెటివ్ విషయాలను శుభ్రపరచడం మరియు "టూ ట్రైన్" అంటే ఎక్కువ పాజిటివ్ రకంలో శిక్షణ ఇవ్వడం. కాబట్టి, కొన్నిసార్లు మైండ్ ట్రైనింగ్ ను "యాటిట్యూడ్ ట్రైనింగ్" అని అర్థం చేసుకోవచ్చు. 

మార్చుకోవాల్సిన ప్రధాన నెగెటివ్ ఆలోచనా విధానం మన సొంత-ఆదరణ విధానం, ఇందులో సొంత-కేంద్రీకృతం మరియు స్వార్ధపూరితం ఉంటాయి, వీటిల్లో మన గురించి మాత్రమే ఆలోచించడం ఉంటుంది. శిక్షణ పొందడానికి సానుకూలమైనది ఇతరులను ఆదరించే విధానం, ఇందులో ప్రధానంగా ఇతరుల సంక్షేమం గురించి ప్రేమ మరియు కరుణతో ఆలోచించడం ఉంటుంది. అన్ని మైండ్ ట్రైనింగ్ పద్ధతులలో ఉపయోగించే పద్ధతి బుద్ధుని సాధారణ విధానానికి బాగా సరితూగుతుంది, వీటిని "నాలుగు ఉత్తమమైన సత్యాలు" అని పిలుస్తారు.

నాలుగు ఉత్తమమైన సత్యాలు

బుద్ధుడు మన జీవితంలో సమస్యలను ఎలా అధిగమించాలో చాలా ప్రాక్టికల్ స్థాయిలో మనకు బోధించాడు. నిజానికి, అతను బోధించిన ప్రతిదీ ఈ లక్ష్యాన్ని ముఖ్యంగా పెట్టుకున్నదే. మనందరికీ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కొన్ని స్థూలంగా ఉంటాయి మరియు అవి చాలా బాధపెడతాయి; అవి మనకు శారీరకంగా, మానసికంగా లేదా రెండు విధాలుగా చాలా నొప్పిని కలిగిస్తాయి. మరికొన్ని కొంచెం చిన్నవిగా ఉంటాయి, కానీ అవి కూడా చాలా బాధను కలిగిస్తాయి. ఉదాహరణకు, మనం జీవితంలో వివిధ విషయాలను ఆస్వాదిస్తాము, కానీ అవి మనల్ని పూర్తిగా సంతృప్తిపరచవు కాబట్టి మనం నిరాశ చెందుతాము. అవి శాశ్వతంగా ఉండవు; అవి మారుతూ ఉంటాయి. మన జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు; అవి ఎప్పుడూ మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు పనులు సవ్యంగా జరుగుతాయి, కొన్నిసార్లు అలా జరగవు; మరియు నిజంగా అస్థిరమైనది ఏమిటంటే, మనం వాటి గురించి ఎలా భావిస్తాము అని. కొన్నిసార్లు సంతోషంగా, కొన్నిసార్లు అసంతృప్తిగా ఉంటాం; కొన్నిసార్లు మనకు ఏమీ అనిపించనట్లు ఉంటుంది, మరియు తర్వాతి క్షణంలో మనం ఎలా అనుభూతి చెందుతామో మనకు తెలియదు. ఇది మనతో ఉన్న వ్యక్తులపై లేదా మనం ఏమి చేస్తున్నాము అనే దానిపై కూడా అంతగా ఆధారపడినట్లు అనిపించదు - అకస్మాత్తుగా, మన మానసిక స్థితి మారిపోతుంది.

మనందరికీ భావోద్వేగ సమస్యలు కూడా ఉన్నాయి, మరియు అవి జీవితంలో వివిధ సమస్యలను తెచ్చిపెడతాయి. నిజంగా నిరాశ కలిగించే విషయం ఏమిటంటే అవి మళ్ళీ రిపీట్ అవుతాయి. కొన్నిసార్లు అవి ఇతరుల నుంచి వచ్చినట్లు అనిపించినప్పటికీ, మన కోసం ఇంకా ఎక్కువ సమస్యలను సృష్టిస్తుంది. కానీ మనం ఇంకా నిశితంగా, మరింత నిజాయితీగా పరిశీలిస్తే, మన సమస్యలకు మూలం మనమే, ముఖ్యంగా, మన జీవితంలో జరిగేదానికి మన సొంత-కేంద్రీకృత విధానాలు.

బుద్ధుడు వీటన్నిటినీ చూశాడు. ఈ విషయాన్ని ఆయన తన జీవితంలోనే గ్రహించాడు. ఇతరుల జీవితాల్లో దీన్ని చూశాడు. అందరూ ఒకే దుస్థితిలో ఉండటాన్ని గమనించాడు. పూర్తి స్థాయిలో, మనమందరం జీవితంలోని సాధారణ సంఘటనలతో - పుట్టడం, పెరగడం, అనారోగ్యానికి గురికావడం, వృద్ధాప్యంలోకి పోవడం మరియు చనిపోవడం - అలాగే మన భావాలు ఎప్పుడూ మారుతూ ఉండడం గమనించాడు. కానీ ఇవి మనకున్న సమస్యలు కారణాల వల్ల ఉత్పన్నమవుతాయని ఆయన చెప్పాడు. అవి ఎక్కడి నుంచో రావట్లేదు. అవి మనకు పంపుతున్న ఏదైనా బయట సందర్భం నుంచి రావడం లేదు - మనం ఆ బయటి శక్తిని "దేవుడు" అని పిలుస్తాము లేదా దాన్ని ఇంకా వ్యక్తిగతమైనదిగా చేసి విధి అని పిలుస్తాము. నిజానికి మన సమస్యలకు మూలం అది కాదు.

మన సమస్యలకు నిజమైన మూలం లోపలే ఉంటుంది, మరియు అది లోపల ఉంటుందని చెప్పినప్పుడు, మనం సహజంగా చెడ్డవాళ్ళం లేదా దోషులం అని అర్థం కాదు. నువ్వు చెడ్డవాడివి, పాపంతో పుట్టావు అని బుద్ధుడు అనలేదు. కానీ బుద్ధుడు మన సమస్యలకు మూలం రియాలిటీ గురించి మనకు ఉండే గందరగోళం అని చెప్పాడు. మనం మూర్ఖులమని కాదు, కానీ మన రోజువారీ అనుభవంలో వాస్తవానికి ఏమాత్రం పొంతన లేని అసాధ్యమైన మార్గాల్లో విషయాలు ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. మనల్ని, ఇతరులను మనం ఎలా చూస్తున్నామనే విషయంలో ఇది ముఖ్యమైనది, ఇది వారి పట్ల మరియు మన పట్ల మన ఆలోచనా విధానాన్ని రూపొందిస్తుంది. మన సొంత-కేంద్రీకృత మరియు సొంత-ఆదరింపు కారణంగా, మనం చాలా ముఖ్యమైన వ్యక్తిగా అనిపిస్తుంది మరియు మనం ఎప్పుడూ మనకు నచ్చిన విధంగా జరగాలి అని అనుకుంటాం మరియు ఇతరులు ఏమి అనుభవిస్తారు అనేది ముఖ్యం కాదు. ఇతరులు ఏమనుకుంటారో అది లెక్కలోకి రాదు, అది ఉనికిలో కూడా ఉండదు. మనం అనుభవించేది మన అవాస్తవిక అంచనాలపై ఆధారపడి ఉంటుంది మరియు నిజానికి మనం ఎదుర్కునే వాస్తవ పరిస్థితులపై కాదు అనే కోణంలో దీన్ని అర్థం చేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను.

కానీ బుద్ధుడు ఈ పరిస్థితిని ముగించడం, ఈ సమస్యలు మళ్లీ రాకుండా చెయ్యడం సాధ్యమేనని చెప్పాడు. ఈ సమస్యలను శాశ్వతంగా అనుభవించాల్సి వస్తుందని కాదు. మాదకద్రవ్యాలు సేవించడం లేదా తాగడం ఒక్కటే పరిష్కారం కాదని, అలా మనం బాధ పడకుండా ఉండి కనీసం మనం మన సమస్యల నుంచి తప్పించుకున్నామని అనుభూతిని పొందవచ్చు. మనం ఏమీ ఆలోచించని లోతైన ధ్యాన స్థితిలో మునిగిపోవాల్సిన అవసరం లేదు, అది మన సమస్యలను పరిష్కరిస్తుంది. ఇటువంటి పరిష్కారాలు తాత్కాలికమైనవి మాత్రమే, మరియు అవి నిజంగా మన సమస్యలను పోయేలా చెయ్యవు. మనం మన సమస్యల నుంచి బయటపడాలంటే, ఆ సమస్యలకు ఉండే కారణాన్ని మనమే వదిలించుకోవాలి. మన ఇబ్బందుల నుంచి బయటపడాలి. మనం ఇబ్బందులను సరైన అవగాహనతో పోగొట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు మరియు ఎవరూ దుఃఖంలో ఉండాలని కోరుకోరు మరియు ఆనందం పొందే హక్కు అందరికీ ఉంటుంది. అంతేకాక, మనం ఒక వ్యక్తి మాత్రమే మరియు మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రియాలిటీని గమనించి దానికి అనుగుణంగా మన ఆలోచనా విధానాలను మార్చుకుంటే, నెమ్మదిగా, మన అవగాహన ఇంకా లోతుగా పెరిగి మన భావోద్వేగ స్థితులు కూడా మారతాయి.

మైండ్ ట్రైనింగ్

మనం మన జీవితంలో ఎక్కువ భాగం మన ఊహల ప్రపంచంలో జీవిస్తున్నాము కాబట్టి, మన ఇబ్బందులు మనం అనుభవించే ప్రతి దాని పట్ల మనకు ఉన్న ఆలోచనలను సృష్టిస్తుంది. సొంత-ఆదరణ ఆలోచనతో, మనకు మరియు ఇతరులకు ఎక్కువ అసంతృప్తిని మరియు సమస్యలను సృష్టించే స్వార్ధపు మార్గాల్లో మనకు ఏమి జరుగుతుందో మనం పరిగణిస్తాము. కానీ ఆలోచన మార్పుతో, జీవితంలో జరిగే సంఘటనల యొక్క మన అనుభవం నాటకీయంగా మారుతుంది.

ఉదాహరణకు, విమానాశ్రయంలో మన విమానం ఆలస్యాన్ని వ్యక్తిగత ప్రమాదంగా చూడటానికి బదులుగా, రియాలిటీలో చూస్తే మనం మరియు విమానం కోసం ప్రతి ఒక్కరూ వెయిటింగ్ ఏరియాలో ఎక్కువ సమయం గడుపుతున్నాము. అప్పుడు మనం పరిస్థితిని చూసే విధానాన్ని మార్చవచ్చు మరియు ఆలస్యంతో ఇతరులు ఎలా వ్యవహరిస్తున్నారనే ఆలోచనతో, తోటి ప్రయాణికుడితో సంభాషించడానికి మరియు ఆహ్లాదకరంగా మరియు ఇబ్బంది పడకుండా ఉండటం ద్వారా, దీన్ని ఒక అవకాశంగా చూడవచ్చు. శారీరక వ్యాయామం ద్వారా, మన శరీరాలు బలంగా మారడానికి మరియు ఎక్కువ ఓర్పును కలిగి ఉండటానికి శిక్షణ ఇవ్వవచ్చు; అదే విధంగా, ధ్యానం ద్వారా, మన మనస్సులను మరియు దాని ఆలోచనలను కూడా బలంగా మరియు ఎక్కువ పాజిటివ్ గా మార్చడానికి మరియు భావోద్వేగ ఇబ్బందులు పడకుండా, ఇబ్బంది కలిగించే పరిస్థితులకు మంచి ఓర్పును కలిగి ఉండటానికి శిక్షణ ఇవ్వవచ్చు.

భావోద్వేగ బలాన్ని పొందడం

ఒక్కోసారి మన సమస్యలేమిటో మనం అర్థం చేసుకోవచ్చు. మన మనస్సులు బాధలో మరియు సంకుచితంగా ఉండటం, మన గురించి మాత్రమే ఆలోచించడం వల్ల మనం ఒక నిర్దిష్ట రకమైన భావోద్వేగ క్షోభను అనుభవిస్తున్నామని అర్థం చేసుకున్నాము, కానీ అది మన భావోద్వేగాలను మార్చినట్లు అనిపించదు. మన అవగాహన నిజంగా మనం అనుభూతి చెందే విధానాన్ని ప్రభావితం చెయ్యదని మనం భావిస్తాము. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, ఆ అవగాహన నిజంగా అంత లోతుగా ఉండదు. ఇది అంత లోతుగా ఉండకపోవడమే కాదు, మన ఆలోచనా విధానాలలో మార్పు తీసుకురావడానికి అది చాలా కాలంగా "కలిసిపోకుండా ఉంటుంది".

దీన్ని వివరించడానికి శారీరక ఆరోగ్యం యొక్క ఉదాహరణను మనం మళ్ళీ ఉపయోగిద్దాం. మనం ఎప్పుడూ శారీరక బలహీనంగా, అలసటగా మరియు బరువుగా భావిస్తాము, కాబట్టి మనం జిమ్ లేదా ఫిట్‌నెస్ క్లబ్ కు వెళ్లడం ప్రారంభిస్తాము మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం ప్రారంభిస్తాము. ఒకసారి మనం వ్యాయామ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత, అది మనం శారీరకంగా అనుభూతి చెందే విధానాన్ని వెంటనే మార్చదు. మన ఆరోగ్యం పరంగా మనం దాని ప్రభావాన్ని అనుభవించడానికి చాలా సమయం పడుతుంది, సాధారణంగా చాలా నెలలు పడుతుంది. అయితే, మనం ఎక్కువసేపు వ్యాయామం చేస్తే, అది మన జీవితంలో ఒక సాధారణ దినచర్యగా మారుతుంది, కొంతకాలం తర్వాత అది నిజంగా మనకు అనిపించే విధానాన్ని మారుస్తుంది: మనం గొప్పగా అనుభూతి చెందడం ప్రారంభిస్తాము. మన గురించి మనం మంచిగా అనుభూతి చెందుతాము మరియు ఇతరులతో ఎలా వ్యవహరిస్తాము అనే దాని పరంగా మంచి అనుభూతి చెందడానికి ఇది సహాయపడుతుంది.

మన మనస్సులో ఏమి జరుగుతుందో, మన భావోద్వేగాలు మరియు మన వైఖరుల గురించి కొంత అవగాహన ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. మనకు కొంత అవగాహన ఎక్కువ కాలం ఉండి, ఎక్కువ సేపు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే, మన అవగాహన అంత లోతుగా మారుతుంది. అప్పుడు భావోద్వేగ మార్పు వెంటనే మారనప్పటికీ, మన ఆలోచనలను మార్చుకునే కొద్దీ మనం ఎక్కువ భావోద్వేగ సమతుల్యతను మరియు బలాన్ని పొందుతాము.

మనపై మనం పని చేసుకోవడానికి ఉండే ప్రేరణ స్థాయిలు

ఫిట్ నెస్ క్లబ్ కు వెళ్లాలంటే సొంత క్రమశిక్షణ మాత్రమే కాదు, బుద్ధిపూర్వకత కూడా అవసరం, అంటే బయటకు వెళ్లడం  మర్చిపోకుండా గుర్తుంచుకోవడం. వీటన్నిటి వెనుక ఉండే దాన్ని మనం "కేరింగ్ యాటిట్యూడ్" అని పిలుస్తాము - మన గురించి మనం శ్రద్ధ వహిస్తాము, మనం ఎలా ఉంటాము, ఎలా అనుభూతి చెందుతాము మొదలైన వాటి గురించి మనం శ్రద్ధ వహిస్తాము. మనల్ని మనం సీరియస్ గా తీసుకుంటాం మరియు ఒక రకంగా చెప్పాలంటే, మనం సంతోషంగా ఉండటానికి మరియు మంచి అనుభూతి చెందడానికి ఉన్న దాదాపు పూర్తి "హక్కును" గౌరవిస్తాము. మనల్ని మనం అర్థం చేసుకోవడంలో, మన భావోద్వేగ జీవితాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడంలో కూడా అలాగే ఉంటుంది. అది కూడా మన గురించి శ్రద్ధ వహించడంపై ఆధారపడి ఉంటుంది, అవును, మెరుగైన మానసిక ఆరోగ్యానికి కూడా మనకు హక్కు ఉందని భావించడం.

మన గురించి మనం చూపించే ఈ శ్రద్ధా విధానం సొంత-ఆదరణ ఆలోచనకు చాలా వేరుగా ఉంటుంది. ఆత్మాభిమానంతో మన గురించి మాత్రమే మనం ఆలోచిస్తాం, ఇతరుల శ్రేయస్సును పట్టించుకోము. మన వైఖరులు మరియు ప్రవర్తన మనం సంభాషించే లేదా కేవలం కలుసుకునే వ్యక్తులను ఎలా ప్రభావితం చేస్తాయనే దాని గురించి మనం పట్టించుకోము. కేరింగ్ యాటిట్యూడ్ తో, మరోవైపు, జీవితంలో మన దుఃఖం మరియు సమస్యలు మన సొంత-కేంద్రీకృత మరియు స్వార్థపూరిత వైఖరి నుంచి వస్తాయని మనం గ్రహిస్తాము మరియు మనం సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాము కాబట్టి, ఈ పరిస్థితి గురించి మనం ఏదైనా చెయ్యాలనుకుంటున్నాము. మన ఆలోచనలను మరియు ప్రవర్తనను మార్చడానికి మనమే పనిచేస్తాము మరియు భవిష్యత్తులో మనం ఏమి సాధించడానికి శిక్షణ ఇస్తున్నామో దాన్ని ఆచరణలో పెట్టడానికి జాగ్రత్తగా ఉంటాము.

ఇప్పుడు ఈ విధంగా పనిచెయ్యడానికి అనేక స్థాయిల ప్రేరణ ఉంటుంది. ప్రేరణ అంటే ఏమిటో అని ఆలోచించినప్పుడు, మనపై పని చెయ్యడంలో మన లక్ష్యం ఏమిటి మరియు ఈ లక్ష్యం వైపు మనల్ని నడిపించే భావోద్వేగ శక్తి గురించి మాట్లాడుతున్నాము. బౌద్ధమత బోధనలు మనం మార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు అనేక ప్రగతిశీల ప్రేరణ స్థాయిలను వివరిస్తాయి. మన జీవిత నాణ్యతను మెరుగుపరచడానికి మనం ప్రయత్నించవచ్చు, ఎందుకంటే ఇది ఇప్పుడు సంతృప్తికరంగా ఉండదు, మరియు ఇది అసంతృప్తికరంగా కొనసాగడం మానేయాలని మనం కోరుకుంటున్నాము, కానీ అది ఇంకా దిగజారకుండా ఉంటే చాలా మంచిది. నిజానికి, ఇది ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేది! మనం నిజంగా అసంతృప్తి చెంది విసిగిపోయి దాని గురించి ఏదైనా చెయ్యాలనుకుంటున్నాము.

ఈ జీవితాన్నే కాదు, భవిష్యత్ జీవితాలను కూడా మనం ఎక్కువ అధునాతన స్థాయిలో ఆలోచించుకోవచ్చు. భవిష్యత్తులో కూడా పరిస్థితులు ఇంకా దిగజారకూడదని మనం కోరుకుంటున్నాము. ఈ జన్మలో ఉండే వాటిని మెరుగుపరచాలనుకునే అదే భావోద్వేగ శక్తితో మనం నడపబడతాము, మనం ఎక్కువ కాలం కోసం చూస్తున్నాము. ఈ రెండింటి మధ్య ఉండే మధ్యంతర అడుగు కూడా వెయ్యవచ్చు, మన కుటుంబంలో మనకు ఉన్న వివిధ సమస్యలు లేదా విషయాలను ఎదుర్కోవడంలో మన మార్గాలు భావితరాలకు చేరకూడదని అనుకుంటాము.

భవిష్యత్తు జీవితాల గురించి ఆలోచించడానికి మించి, పూర్తి అసంతృప్తికరమైన, నిరాశపరిచే పునర్జన్మ చక్రం నుంచి పూర్తిగా బయటపడాలని మనం ప్రేరేపించబడవచ్చు. లేదా, కరుణతో ప్రేరేపించబడి, ఈ స్థాయి సమస్యలన్నింటినీ అధిగమించడానికి ప్రతి ఒక్కరికి సహాయపడటం గురించి మనం ఆలోచించవచ్చు. అలా చేస్తుంటే అప్పుడు మనం ఒక బుద్ధుడిగా మారేందుకు కష్టపడతాం.

ఈ అధునాతన స్థాయి ప్రేరణ ఉన్న వ్యక్తిగా ఉండటానికి విపరీతమైన శిక్షణ అవసరం. ఏదేమైనా, మనం ఏ స్థాయిలో ఉన్నా, బుద్ధుని బోధనలలో సహాయపడే అనేక పద్ధతులు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు, మనం ఈ జన్మ గురించి మాత్రమే ఆలోచిస్తున్నప్పటికీ, మన గురించి ఆలోచనలు మరియు మన స్వంత సమస్యలను అధిగమించడం ద్వారా మాత్రమే కాకుండా, కరుణ, ఇతరుల గురించి ఆలోచించడం ద్వారా కూడా మనల్ని కదిలిస్తారు. మరో మాటలో చెప్పాలంటే, మన సమస్యలను అధిగమించాలని మనం లక్ష్యంగా పెట్టుకోము ఎందుకంటే అవి మనకు ఇబ్బందిని కలిగిస్తాయి మరియు మనకు చాలా బాధను తెచ్చిపెడతాయి, కానీ అవి ఇతరులకు సరైన సహాయం చేయకుండా అడ్డు పడతాయి. ఇది మైండ్ ట్రైనింగ్ పద్ధతిలో మనం చేసే పని.

ఉదాహరణకు, మనం తాగుబోతులం అనుకుందాం. ఒక వైపు నుంచి ఆలోచిస్తే, ఆల్కహాల్ పై ఆధారపడడాన్ని అధిగమించడం ప్రయత్నించడానికి మనం ప్రేరేపించబడవచ్చు ఎందుకంటే ఇది మనకు, మన ఆరోగ్యానికి మరియు సాధారణంగా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా హానికరం. పొద్దున్నే హ్యాంగోవర్ వచ్చినప్పుడు ఇది మనకు చెడు అనుభూతిని ఇస్తుంది. కానీ మన కుటుంబం గురించి ఆలోచిస్తే మనం ఇంకా బలంగా ప్రేరేపించబడతాము. ఉదాహరణకు, నా మద్యపానం నన్ను మంచి తల్లిద౦డ్రులుగా ఉ౦డడానికి ఎలా నిరోధిస్తు౦దో ఆలోచిస్తా౦; నేను మద్యం సేవించి ఉండటం వల్ల నేను ఎప్పుడూ పిచ్చిగా ప్రవర్తిస్తాను, ఇది నా కుటుంబం, నా స్నేహితులు మొదలైన వారిని ఇబ్బంది పెడుతుంది. మన కుటుంబానికి మన అవసరం ఉందని, మద్యపానం వల్ల మనకు ఉన్న సమస్య వారికి ఉన్న నిజమైన అవసరాన్ని తీర్చకుండా నిరోధిస్తుందని గ్రహించినప్పుడు, ఆ ఆధారపడడాన్ని అధిగమించడానికి ప్రయత్నించడానికి ఇది మనకు ఎక్కువ బలాన్ని ఇస్తుంది.

కాబట్టి ఈ జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించే సందర్భంలో మనం ఈ బౌద్ధమత పద్ధతులను ఆచరిస్తున్నప్పటికీ, ఇతరుల పట్ల ప్రేమ మరియు కరుణ యొక్క ప్రేరణ ఉండటం చాలా ముఖ్యం. ఇతరులను ఆదరించడం కోసం ఈ మనస్సు శిక్షణ బోధనలలో ఇది నొక్కి చెప్పబడింది: ఈ పద్ధతులలో చాలా వాటిని మన స్వంత అనుభూతి కోసం ఉపయోగించగలిగినప్పటికీ, ఈ పద్ధతులను ఉపయోగించడం ఖచ్చితంగా చాలా గొప్ప విషయం అలా మనం ఇతరులకు సరైన సహాయం చెయ్యగలము.

జీవితంలో ఎనిమిది తాత్కాలిక విషయాలు (ఎనిమిది ప్రాపంచిక ఆందోళనలు)

మన జీవితంలో, మనం అనేక కష్టమైన పరిస్థితులను ఎదుర్కుంటాము. అవి బాధాకరమైనవి అనే అర్థంలో అవి కష్టంగా ఉండవచ్చు. అవి శారీరకంగా బాధలో ఉండాల్సిన అవసరం లేదు; అవి మానసిక మార్గంలో కూడా ఉండవచ్చు. ఉదాహరణకు, ఈ కష్టమైన పరిస్థితులను మనం అర్థం చేసుకోవచ్చు, ఉదాహరణకు, మనల్ని ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు బలంగా తలెత్తడానికి కారణమయ్యే పరిస్థితులను ఎదుర్కోవచ్చు. ఈ ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు ఒక వైపు కోపం కావచ్చు, కానీ అవి మరొక వైపు బలమైన అనుబంధం కూడా కావచ్చు. మన మనస్సులు కోపం లేదా శత్రుత్వంతో నిండినప్పుడు లేదా అవి గొప్ప అనుబంధం మరియు కోరికతో నిండినప్పుడు మనం ఎంత అసౌకర్యంగా భావిస్తామో మనందరికీ తెలుసు.

కొన్ని పరిస్థితులు ముఖ్యంగా కష్టమైనవి మరియు అవి "జీవితంలో తాత్కాలిక విషయాలు" అని పిలువబడే ఎనిమిది బౌద్ధమత విషయాల  జాబితాలో పేర్కొనబడ్డాయి. కొన్నిసార్లు అవి "ఎనిమిది ప్రాపంచిక ఆందోళనలు" లేదా "ఎనిమిది ప్రాపంచిక ధర్మాలు" అని అనువదించబడతాయి, కాని అవి మన జీవితంలో తాత్కాలికమైన విషయాల గురించి మాట్లాడతాయి; అవి స్థిరంగా ఉండవు, అవి వచ్చి వెళ్లిపోతాయి. అవి నాలుగు జతలుగా వస్తాయి:

  • ప్రశంసలు లేదా విమర్శలను పొందడం – మనకు ప్రశంసలు లభిస్తే, మనం సంతోషిస్తాము మరియు దానితో అనుబంధించబడతాము; మరియు మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు, కలత చెందుతాము మరియు కోపంగా ఉంటాము.
  • శుభవార్త లేదా చెడు వార్తలను పొందడం - మనకు శుభవార్త వచ్చినప్పుడు మనం చాలా ఉద్వేగానికి గురవుతాము, నిజానికి, మనం దానితో అనుబంధించబడతాము, ఇంకా కావాలని కోరుకుంటాము, అలా ఎప్పుడూ జరగదు. చెడు వార్తలు విన్నప్పుడు మనం బాగా బాధ పడి నిరాశ మరియు కోపానికి గురవుతాము.
  • లాభాలు లేదా నష్టాలను అనుభవించడం - ఉదాహరణకు, ఎవరైనా మనకు ఏదైనా ఇచ్చినప్పుడు, మనమందరం సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంటాము మరియు "ఓహ్, ఎంత అద్భుతమైనది" అని అనుకుంటాము. అలాగే, మనం ఏవైనా వస్తువులను కోల్పోయినప్పుడు, లేదా ప్రజలు వాటిని మన నుంచి దొంగలించినప్పుడు, లేదా అవి విరిగిపోయినప్పుడు, మనం బాధ పడతాము. లాభనష్టాలు మన జీవితాల్లోకి వచ్చే వ్యక్తుల లాగా కూడా ఉండవచ్చు. మనం ఒక స్నేహితుడిని పొందుతాము, లేదా మనకు నచ్చిన వ్యక్తిని కోల్పోతాము, లేదా ఇది ఆర్థికంగా కూడా జరగవచ్చు.
  • పనులు సక్రమంగా జరగడం లేదా చెడుగా జరగడం - మనమందరం ఉద్వేగానికి లోనవుతాము మరియు అనుబంధించబడతాము, లేదా మనం నిరాశ మరియు కోపానికి గురవుతాము.

మన సొంత స్వార్ధం కారణంగా ఈ ఎనిమిది తాత్కాలిక సంఘటనల వల్ల మనం ఇబ్బంది పడతాము. మనం మన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాము మరియు మనకు ఏమి జరుగుతుంది మరియు "నేను ఎంత అద్భుతమైన వాడిని" లేదా "నేను ఏంటో ఇలా ఉన్నాను" అని భావిస్తాము.

తాత్కాలిక ప్రత్యర్థి ఫోర్స్ లను అప్లై చెయ్యడం

జీవితంలో ఈ ఎనిమిది తాత్కాలిక విషయాలకు ప్రతిస్పందనగా సాధారణంగా ఇబ్బంది పెట్టే భావోద్వేగాలను అధిగమించడానికి బుద్ధుడు అనేక విభిన్న పద్ధతులను బోధించాడు. అందులో ఇతరులను ఆదరించే మంచి ప్రయోజనకరమైన ఆలోచనతో మనం అనుభవిస్తున్నదాన్ని చూడటానికి మనల్ని మనం శిక్షణ పొందాలి అని ఉంటుంది. ఒక పరిస్థితిని తాత్కాలిక ప్రత్యర్థి ఫోర్స్ యొక్క లెన్స్ ద్వారా చూడటం ఒక పద్ధతి. అది మనల్ని ఇబ్బంది పెట్టే భావోద్వేగాలను శాశ్వతంగా వదిలించుకోవడం కాదు. ఇది సరిపడేంత లోతుగా వెళ్ళదు, కానీ ఇది చాలా సహాయపడుతుంది.

కోపానికి ప్రత్యర్థిగా ప్రేమ

ఉదాహరణకు, పరిస్థితులు మనకు చెడుగా జరుగుతున్నాయని అనుకుందాం. మన జీవితంలో ఎవరైనా మన పట్ల చాలా అసహ్యకరమైన, చెడు రీతిలో ప్రవర్తిస్తున్నారు, మరియు మనం ఎప్పుడూ ఈ వ్యక్తిపై కోపంతో ఉంటాము. మన గురించే ఆలోచిస్తూ, "వాళ్ళు నాతో ఎలా ప్రవర్తిస్తున్నారో నాకు నచ్చడం లేదు" అని ఆలోచిస్తాం. కోపానికి తాత్కాలిక ప్రత్యర్థిగా మనం ఇక్కడ చెప్తున్నది ప్రేమ. ఇప్పుడు, మనం ఇక్కడ చాలా సరళమైన పద్ధతిలో చెప్పడం లేదు, "సరే, ఈ వ్యక్తిపై కోపంగా ఉండకండి, వారిని ప్రేమించండి" అని. సహజంగా, మనలో చాలా మందికి అలా మారడం కుదరదు, కానీ ఒకరినొకరు గౌరవించడం ఆధారంగా మన భావోద్వేగ స్థితిని మరియు ఆలోచనను మార్చగలగడానికి అవగాహనను ఉపయోగించడానికి ఇక్కడ ఒక మంచి ఉదాహరణ ఉంది.

ఈ వ్యక్తి మన పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాడు, మరియు అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? ఏదో ఒకటి వారిని కష్టపెడుతుంది. ఉదాహరణకు, ఎప్పుడూ కంప్లైంట్ చేసే ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీతో ఉన్నప్పుడల్లా, వారి మాటలు అన్నీ దీని గురించి లేదా దాని గురించి కంప్లైంట్ చెయ్యడమే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ తమ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, మరియు వారితో ఉండటం పూర్తిగా "చేదు" అనుభవం. దీన్ని మనం విశ్లేషిస్తే, ఆ వ్యక్తి చాలా అసంతృప్తితో ఉన్నందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని మనకు స్పష్టంగా తెలుస్తుంది. మన ఆలోచనా విధానాన్ని మార్చడానికి ఒక ఉత్పాదక మార్గం ఏమిటంటే, "ఈ వ్యక్తి సంతోషంగా ఉండగలిగితే, అతను కంప్లైంట్ చెయ్యడం మరియు నన్ను కష్టపెట్టడం మానేస్తాడు" అని అనుకోవడం. బౌద్ధమతంలో ప్రేమకు నిర్వచనం అవతలి వ్యక్తి సంతోషంగా ఉండాలని మరియు ఆ సంతోషానికి కారణాలు ఉండాలని కోరుకోవడం. కాబట్టి అవతలి వ్యక్తి వెళ్లిపోయి మనల్ని ఇబ్బంది పెట్టకూడదని కోరుకునే బదులు, అతను సంతోషంగా ఉండాలని, అతనిని ఇబ్బంది పెట్టేవి పోతాయనే కోరికను పెంచుకుంటే, మనం తక్కువ బాధ పడతాం. అటువంటి వైఖరి మార్పును అప్లై చెయ్యడానికి ధ్యానంలో ఉపయోగించే సాధన "మైండ్ ట్రైనింగ్".

అధిక లైంగిక ఆకర్షణ తగ్గుతుంది

అదే విధంగా, మనం ఎవరి పట్లనైనా బాగా ఆకర్షితులైతే, మన ఊహను ఉపయోగించుకునే తాత్కాలిక ప్రత్యర్థులను వర్తింపజేస్తాము. స్వార్ధంగా ఉండి, ఆ వ్యక్తి గురించి వారి బయటి రూపాన్ని బట్టి మాత్రమే ఆలోచించడానికి బదులుగా, అవి కేవలం నా ఆనందం కోసం నేను తినడానికి ఒక వస్తువుగా, వారి లోపలి భాగాలు ఎలా ఉంటాయో అని మనం ఊహించవచ్చు - వారి కడుపు, ప్రేగులు, మెదడు మొదలైనవి. ముఖ్యంగా వారి ముఖాన్ని చూసినప్పుడు, వారి పుర్రె యొక్క అస్థిపంజరం యొక్క నిర్మాణాన్ని ఊహించడం కూడా సహాయపడుతుంది. నిజానికి, మనం ఊహిస్తున్నది నిజం, అదే ఈ వ్యక్తి చర్మం క్రింద ఉన్నది.

ఇంకొక ప్రభావవంతమైన పద్ధతి ఏమిటంటే, వాళ్ళను ఒక బిడ్డగా ఊహించి తర్వాత వాళ్ళు చాలా వృద్ధుడి వయస్సులో ఎలా ఉంటారో ఊహించడం. ఈ విధంగా, మనం చూసేది కేవలం బయటి రూపం మాత్రమే అని గ్రహించడం ద్వారా, ముఖ్యంగా ఇది లైంగిక ఆకర్షణ అయితే, అది ఖచ్చితంగా ఉండదని మనకు తెలుస్తుంది. లేదా వారికి ఏదైనా భయంకరమైన చర్మ వ్యాధి ఉంటే, లేదా చాలా భారీ మొటిమలతో కప్పబడి ఉంటే, అవి ఇప్పటికీ మనకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయా? నిజానికి ఈ వ్యక్తి లోపల పేగులు మరియు అస్థిపంజరం ఉన్నాయని మనం ఎంత ఎక్కువగా అర్థం చేసుకున్నామో, మన ఆలోచన అంతగా మారుతుంది మరియు మన మానసిక బాధ తగ్గుతుంది. మనం ఇంకా స్థిరంగా ఉంటాం.

అప్పుడు మనం వారి గురించి ఒక శ్రద్ధను పెంపొందించుకోవడానికి పద్ధతులను అప్లై చెయ్యవచ్చు. ఈ వ్యక్తి పట్ల మనకు ఇంత బలమైన లైంగిక ఆకర్షణ, మరియు అనుబంధం ఉన్నప్పుడు, సాధారణంగా అది వారి శరీరంపై మాత్రమే దృష్టి పెడుతుందని మనం చూడవచ్చు. వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకునే, అసంతృప్తిగా ఉండటానికి ఇష్టపడని మరియు కేవలం లైంగిక వస్తువుగా పరిగణించబడటానికి ఇష్టపడని మనుషులు అనే నిజాన్ని మనం మర్చిపోతాము. ఈ వ్యక్తికి తన స్వంత అభద్రత, భావోద్వేగ సమస్యలు, మరియు కుటుంబ సమస్యలు ఉన్నాయి, మరియు ఈ విధంగా వారిని చూసే మార్గాలు వారిని లైంగిక వస్తువుగా చూడటానికి వ్యతిరేకం. మనం నిజానికి వారిని నిజమైన మనుషులుగా చూస్తాము మరియు వారి ఆనందం మరియు ఆరోగ్యం గురించి మంచి శ్రద్ధను పెంపొందించుకోవడం ప్రారంభిస్తాము.

బిచ్చగాళ్లు లేదా వికలాంగుల పట్ల తప్పుగా ఉండడం లేదా ఉదాసీనతను నివారించడం

మనకు అసహ్యంగా అనిపించే వ్యక్తిని చూసినప్పుడు ఇలాంటి మంచి ప్రవర్తనను కలిగి ఉండడం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మెక్సికో లేదా భారతదేశం లాంటి దేశాలలో బిచ్చగాళ్లు మరియు చాలా తక్కువ స్థానాలలో ఉన్న పేదలను చూసినప్పుడు ఇది బాగా సహాయపడుతుంది, మిగతా దేశాల కన్నా ఇలాంటి వాళ్ళను ఇక్కడ ఎక్కువగా కలుసుకుంటారు. అంధులు, చెవిటి వాళ్లు లేదా పక్షవాతంతో బాధపడుతున్న వికలాంగులతో కూడా మనం ఇలాంటి ప్రవర్తనను ఉపయోగించవచ్చు, ఎవరితో అయితే మనం ఎప్పుడూ చాలా ఇబ్బందికరంగా మరియు అసౌకర్యంగా భావిస్తామో.

బెర్లిన్ లో ఒకప్పుడు వికలాంగులకు సంబంధించి ఒక ఎగ్జిబిషన్ జరిగిందని నాకు గుర్తుంది. ఒక వైపు పక్షవాతం ఉన్న వ్యక్తులతో వరుస వీడియో ఇంటర్వ్యూలు ఉన్నాయి. వారి అవయవాలు అదుపు లేకుండా వణుకుతున్నాయి, నోరు మొత్తం పక్కకు వెళ్ళిపోయి ఉంది మరియు వారి స్పీచ్ వణుకుతూ ఉంది. ఈ వ్యక్తులు తమ లైంగిక జీవితాల గురించి మాట్లాడుతున్నారు, మరియు వారు ఒకే రకమైన భావోద్వేగాలు, లైంగిక అవసరాలు మరియు అందరి లాగే వాళ్ళకు కూడా అలాంటి సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు తమకు ఉన్న ప్రేమ సంబంధాల రకాలను వివరించారు. నేను అద్భుతంగా భావించిన ఈ ఎగ్జిబిషన్ కు సిటీలోని స్కూల్  పిల్లలందరూ వెళ్ళాల్సిన అవసరం ఉంది, అలా వీళ్ళు అందరి లాగే నిజమైన వాళ్ళు అని చూపించడానికి సహాయపడుతుంది. అటువంటి వ్యక్తులతో ఉన్నప్పుడు మన సొంత విరక్తి ఉదాసీనత లేదా అసౌకర్యాన్ని అధిగమించడానికి ఇది చాలా సహాయకరమైన మార్గం.

మరొక పద్ధతి ఏమిటంటే, మీరు వీధిలో భిక్షాటన చేస్తున్న ఒక ముసలి వ్యక్తిని చూసినప్పుడు, అక్కడ ఆమెను లేదా అతనిని "నా తల్లి" లేదా "నా తండ్రి" అని ఊహించుకోండి. లేదా అలా ఒక యువకుడిని లేదా యువకురాలుని చూస్తే ,'నా కొడుకు' లేదా 'నా కూతురు' ఆ పరిస్థితిలో ఉన్నాడని అనుకోండి. ఈ పద్ధతి మార్పు, వ్యక్తిని మనం ఎలా గౌరవిస్తామో, మన భావోద్వేగ ప్రతిస్పందనను పూర్తిగా మారుస్తుంది.

నేను ఎప్పుడూ అలా చెయ్యలేదని నేను అంగీకరించాలి, కానీ న్యూయార్క్ లోని ఒక వెస్ట్రన్ జెన్ టీచర్ గురించి నాకు తెలుసు, అతని విద్యార్థులు కావాలనుకుంటే, వారు తమ వద్ద ఎలాంటి డబ్బుని ఉంచుకోకుండా వీధుల్లోకి వెళతారు మరియు నిరాశ్రయులుగా ఉండి, ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఒక వారం పాటు భిక్షాటన చేస్తారు.

కష్టమైన పరిస్థితుల్లో ఇతరుల పట్ల మన ఉదాసీనతను అధిగమించడానికి ఇవి చాలా శక్తివంతమైన "మందులు". ఇలాంటి వ్యక్తులను మనం ఎంత కలుసుకున్నప్పుడు, మనం వారిని చూడటానికి ఇష్టపడం అని నేను అనుకుంటున్నాను. ఇది మనకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దానికి అవతలి వైపు ఉండటాన్ని ఊహించుకోండి. అక్కడ మీరు కష్టపడుతున్నారు మరియు ఎవరూ మిమ్మల్ని చూడటానికి లేదా మీ ఉనికిని అంగీకరించడానికి కూడా ఇష్టపడరు, లేదా వారు మిమ్మల్ని ఒక దోమలా తరిమేస్తారు. ఏదేమైనా, ఇది ప్రత్యర్థి శక్తులను వర్తింపజేసే ఒక పద్ధతి, కానీ ఇవి తాత్కాలికమైనవి, అవి సమస్య యొక్క మూలానికి చేరవు.

లోతైన-నటన కలిగిన ప్రత్యర్థిని అప్లై చెయ్యడం

రెండవ మైండ్ ట్రైనింగ్ పద్ధతి ఏమిటంటే, ప్రత్యర్థిని అప్లై చెయ్యడం, ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే కాదు, ఆ సమస్య యొక్క మూలానికి వెళ్లి దాన్ని తొలగిస్తుంది. ఇది పరస్పరం ప్రత్యేకమైన, గందరగోళమైన, తప్పు చేసిన దానికి పూర్తిగా విరుద్ధమైన మానసిక స్థితిని అప్లై చెయ్యడాన్ని సూచిస్తుంది. ఇది శూన్యత (శూన్యం) యొక్క అవగాహనను సూచిస్తుంది, అంటే ఒక వ్యక్తి లేదా పరిస్థితి ఎలా ఉందో అనే తప్పు మార్గం నిజానికి ఏమాత్రం సరిపోలదు. మరో మాటలో చెప్పాలంటే, మన అనుబంధం లేదా కోపం వెనుక విషయాలు ఎలా ఉన్నాయనే దాని గురించి మనకు గందరగోళం ఉంటుంది.

శూన్యత గురించి లోతైన చర్చకు ఇది సందర్భం కాదు, కాబట్టి విషయాలను చాలా ప్రాథమిక స్థాయిలో ఉంచుకుందాం. ఉదాహరణకు, మీరు వృద్ధ నర్సింగ్ హోమ్ లో అనారోగ్యంతో ఉన్న మీ తాతయ్య లేదా వృద్ధ తల్లిదండ్రులను చూడటానికి వెళ్లారనుకుందాం. హాల్లోంచి వాళ్ళ గదికి వెళ్తుంటే, చక్రాల కుర్చీలో కూలబడి, తనలో తాను గొణుక్కుంటూ, ఒడిలో ఉన్న టవల్ ని కొరుక్కుంటూ, గుసగుసలాడుకుంటూ ఉన్న ఒక ముసలావిడను దాటుకుంటూ వెళ్తారు అనుకుందాం. అలాంటి వ్యక్తిని చూసి మీరు చాలా అసౌకర్యంగా ఫీలవుతారు. ఆమె ఎప్పుడూ అలానే ఉంటుందని మీరు అనుకుంటారు. మీరు వెళ్తుంటే, ఆమె తన చేతిని చాచి, మీ చేతిని పట్టుకోవడానికి లేదా మిమ్మల్ని తాకడానికి ప్రయత్నిస్తే, మీరు భయపడతారు. అక్కడ మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.

నిజానికి, ఈమె ఒక మనిషి అని గుర్తుంచుకోవడానికి తాత్కాలిక ప్రత్యర్థి శక్తిని మనం ఇక్కడ అప్లై చెయ్యవచ్చు. ఆమెకు ఒక జీవితం, ఒక కుటుంబం, ఒక వృత్తి ఉంటుంది మరియు ఒకప్పుడు తను యుక్త వయస్సులో ఉంది; ఆమె ఎప్పుడూ ఇలా కనిపించదు. ఆమె కేవలం మానవ సంబంధాన్ని కోరుకుంటుంది కాబట్టే అలా చేసింది. ఇది ప్రభావవంతంగా ఉంటుంది, కానీ మనం లోతైన పద్ధతిని ఉపయోగించవచ్చు. ఆమె ఉన్నట్లే, ముసలిదై, క్షీణించినట్లుగా ఆమె ఉనికిలో ఉందని నేను ఊహించుకునే విధానం - ఇది అసాధ్యం అని గుర్తించాలి. ఒక స్టిల్ ఫోటోలో లాగా ఎవరూ అక్కడే ఉండిపోరు. అప్పుడు మనం "అలాంటిదేమీ లేదు, అది అసాధ్యం" అనే దానిపై దృష్టి పెడతాము. మన అపోహను ఆపడానికి ఇది చాలా బలమైన మార్గం, అలా ఆమె పట్ల ఎక్కువ వాస్తవిక మరియు దయగల దృక్పథాన్ని కలిగి ఉండవచ్చు.

అంతర్లీన లోతైన అవగాహనను బహిర్గతం చెయ్యడానికి ఇబ్బంది కలిగించే భావోద్వేగాలను రిలాక్స్ చేసుకోవడం

మరొక పద్ధతి "మహాముద్ర" అని పిలువబడే అధునాతన రకం ధ్యానంలో ఉపయోగించబడుతుంది, అంటే "అంతర్లీన లోతైన అవగాహనను చూడటం, దీనిలో ఇబ్బంది పెట్టే భావోద్వేగం దానికదే విడుదల అవుతుంది." ఈ పద్ధతి మన మనస్సులు రియాలిటీను గ్రహించే ప్రాథమిక యంత్రాంగాలను ఉపయోగిస్తుంది - "మన మనస్సు పనిచేసే విధానం", సరళమైన భాషలో చెప్తే.

ఒక ఉదాహరణ చూద్దాం. మనకు ఒకరి పట్ల బలమైన ఆకర్షణ, కోరిక ఉందనుకుందాం. ఆ భావోద్వేగ స్థితిలోని ఉద్రిక్తతను మనం తగ్గించుకోగలిగితే, క్రింద మనకు కనిపించే దాన్ని "లోతైన అవగాహనను వ్యక్తిగతీకరించడం" అని పిలుస్తారు. మరో మాటలో చెప్పాలంటే, ఈ వ్యక్తి గురించి మనం తెలుసుకునే విధానం పరంగా జరుగుతున్నది ఏమిటంటే, మనం ఈ వ్యక్తిని ఇతరులకు భిన్నంగా ఒక వ్యక్తిగా చెప్తాము. నిజానికి, మనస్సు యొక్క ప్రాథమిక నిర్మాణం పరంగా ఇది జరుగుతోంది. అప్పుడు, "ఈ వ్యక్తి ప్రత్యేకమైన వాడు" అని మనం దానిపై ప్రొజెక్ట్ చేస్తాము. మనం కొన్ని లక్షణాలను అతిశయోక్తి చేస్తాము మరియు తర్వాత ఆకర్షణ కోరిక లేదా అనుబంధాన్ని అనుభవిస్తాము.

కోరిక అనేది మీకు వస్తువు లేనప్పుడు, మీరు దాన్ని పొందాలని కోరుకున్నప్పుడు, మరియు మీకు అది ఉన్నప్పుడు, మీరు విడిచిపెట్టడానికి ఇష్టపడనప్పుడు అటాచ్ మెంట్ అనేది ఉంటుంది అదే కోరిక. ఈ రెండూ పూర్తిగా స్వయంకృషితో ఉంటాయి. అతిశయోక్తి యొక్క బిగుతు శక్తిని మనం ఈ మానసిక స్థితిలో రిలాక్స్ చేస్తే, మిగిలేది మనస్సు ఈ వస్తువు పట్ల ఏమి చేస్తుందనే ప్రాథమిక నిర్మాణం మాత్రమే, అది దాన్ని నిర్దేశిస్తుంది. అంతే.

మీరు దీన్ని ఉపయోగించగలిగితే ఇది చాలా అధునాతనమైన, కానీ చాలా ప్రభావవంతమైన పద్ధతి, మీ భావోద్వేగాలకు లోనుకాకుండా ఉండటానికి కొంచెం పరిపక్వత అవసరం. మీరు దేనితోనైనా వ్యవహరించే మీ భావోద్వేగ మార్గం క్రింద ఏమి జరుగుతుందో చూడగలగాలి మరియు తర్వాత కూల్ అవ్వాలి. భావోద్వేగం దానికదే వస్తుంది, దాని వెనుక ఉన్న ప్రాథమిక అభిజ్ఞా నిర్మాణాన్ని మనం చూస్తాము.

నెగెటివ్ పరిస్థితులను పాజిటివ్ గా మార్చడం: ఇతరులను మనం ఎలా చూస్తాం అని

తర్వాతి పద్ధతి, మీ అభ్యాసానికి అనుకూలం కాదని మీరు భావించే పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చడం, సాంప్రదాయ మైండ్ ట్రైనింగ్ గ్రంథాలలో, ముఖ్యంగా లాంగ్రీ టాంగ్పా రాసిన ఎనిమిది వచనాల మైండ్ ట్రైనింగ్ లో ప్రధానమైనది. భోధిసత్వ ప్రవర్తనలో గొప్ప భారతీయ గురువు శాంతిదేవుని శ్లోకం ఈ విధానాన్ని సూచిస్తుంది. అతను ఇలా రాశాడు,

(VI.10) దాన్ని సరిదిద్దుకోగలిగితే, దాని గురి౦చి చెడు మానసిక స్థితిలోకి ఎ౦దుకు వెళ్లాలి? మరియు, దాన్ని సరిదిద్దలేకపోతే, దాని గురి౦చి చెడు మూడ్ లోకి వెళ్లడం వల్ల ఉపయోగం ఏమిటి?

పరిస్థితిని మార్చడానికి మీరు ఏదైనా చెయ్యగలిగితే, దాని గురించి ఎందుకు బాధ పడాలి? వెంటనే దాన్ని మార్చండి. మీరు దాని గురించి ఏమీ చెయ్యలేకపోతే, ఎందుకు బాధ పడాలి? ఇది ఏమీ సహాయపడదు. కాబట్టి, మనకు చాలా హానికరమైన, కష్టమైన, విమర్శలు వస్తూ లేదా పనులు చెడుగా జరుగుతున్నప్పుడు, ఆ పరిస్థితిని మార్చలేకపోతే, దాని గురించి ఎందుకు బాధ పడాలి? దాని పట్ల మీ వైఖరిని మార్చుకోండి.

నెగెటివ్ పరిస్థితిని పాజిటివ్ గా మార్చడానికి అనేక విభిన్న పద్ధతులు ఉన్నాయి. మన ఆలోచనను మార్చడానికి కొన్ని మార్గాలు ఇతరులు మనకు ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు వాటిని వేరే విధంగా ఎలా చూస్తాము అనే దానితో సంబంధాన్ని కలిగి ఉంటాయి, మరియు ఇతరులు ఈ కష్ట పరిస్థితులలో మనల్ని మనం ఎలా చూస్తాం అనే దానితో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఎదుటివారి పట్ల మన వైఖరులకు సంబంధించిన వాటిని ముందుగా మనం పరిశీలిద్దాం.

సమస్యాత్మక వ్యక్తులను కోరికలు తీర్చే రత్నం లాగా చూడటం

సమస్యాత్మక వ్యక్తుల పట్ల మన ఆలోచనా విధానాన్ని మార్చడానికి ఒక మార్గం ఏమిటంటే, వారిని "కోరికలు తీర్చే రత్నం" లాగా చూడటం. ఉదాహరణకు, మన౦ ఇలా ఆలోచి౦చవచ్చు, "ఇక్కడ ఎవరో నాకు సవాలు విసురుతున్నారు; నేను ఎంత వరకు అభివృద్ధి చెందానో పరీక్షించడానికి వాళ్ళు చెప్పి నాకు ఎదగడానికి అవకాశం ఇస్తున్నారు. ఇది అద్భుతం." లేదా, "ఈ వ్యక్తి నన్ను భోజనానికి ఆహ్వానించాడు, మరియు అతను ఎప్పుడూ నా మీద కంప్లయింట్ చేస్తాడు, మరియు పూర్తిగా నిరాశ చెందుతారు, అందుకే ఈ వ్యక్తి నన్ను ఆహ్వానించడం ఎంత గొప్పది! ఎందుకంటే ఇప్పుడు నాకు సహనం మరియు అవగాహనను అభ్యసించే అవకాశం లభించింది. కాబట్టి, అతను కోరికలు తీర్చే రత్నం లాంటి వాడు.

శాంతిదేవుడు దీన్ని చాలా చక్కగా వర్ణించాడు,

(VI.107) కాబట్టి, భోధిసత్వ ప్రవర్తనకు అతను నాకు సహాయం చేస్తాడు కాబట్టి నేను అలసిపోకుండా ఆ శత్రువుతో మంచి శతృత్వాన్ని సంతోషంగా ఆహ్వానిస్తాను.

ఇతరులందరి ప్రయోజనం కోసం జ్ఞానోదయం పొందడానికి అంకితమైన భోధిసత్వుడికి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ఎవరైతే వారి కోసం ఏదైనా చెయ్యమని అడిగినప్పుడే. తనను ఏమీ చెయ్యమని ఎవరూ అడగకపోతే, అతను చాలా డల్ అయిపోతాడు, నిరుపయోగంగా భావిస్తాడు. నాకు ఒక వెబ్‌సైట్ ఉంది మరియు నాకు చాలా ఇ-మెయిల్స్ వస్తాయి, ప్రశ్నలు అడుగుతూ లేదా పనులు చెయ్యమంటూ వస్తాయి, వాటన్నిటి గురించి ఆలోచించి చిరాకు పడటం చాలా సులభం. కానీ నేను వేరేలా ప్రాక్టీస్ చెయ్యగలిగితే సంతోషిస్తాను. అది ఎంత ఎక్కువగా వస్తే, ప్రజలకు సహాయం చెయ్యడానికి నాకు అంత ఎక్కువ అవకాశం ఉంటుంది. "నేను సమస్త ప్రాణులకు ఉపయోగపడగలనా" అని బౌద్ధమత పద్ధతిలో ప్రార్థిస్తుంటే, అప్పుడు ఎక్కువ మంది జీవులు మన దగ్గరకు వచ్చి వారికి సహాయం చెయ్యమని అడుగుతుంటే, మన ప్రార్థనలు ఫలించవా?

శాంతిదేవుడు చెప్పినట్లుగా,

(VII.64) ప్రజలు సంతోషం కోసం పనులు చేసినప్పటికీ, వాళ్ళు సంతోషంగా ఉంటారా లేదా అనేది స్పష్టంగా మనకు తెలియదు; కాని (భోధిసత్వుడు) చేసే పనులు సంతోషాన్ని కలిగిస్తాయి, ఆ పనులు చెయ్యకుండా అతను ఎలా సంతోషంగా ఉండగలడు?

అనారోగ్యంతో ఉన్న మన బాబు లాంటి ఇబ్బందికరమైన వ్యక్తుల గురించి

మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్న, చాలా అసహ్యంగా ఉన్న ఈ వ్యక్తిని అనారోగ్యంతో ఉన్న మన బాబులా చూడటం మన ఆలోచనలో మరో మార్పు. మన పిల్లవాడు అనారోగ్యానికి గురైనప్పుడు, చిరాకుగా ఉన్నప్పుడు మరియు ఏడుస్తున్నప్పుడు, అది మనల్ని భయపెట్టవచ్చు. కానీ వాడు అనారోగ్యంతో ఉన్నాడని మనం అర్థం చేసుకున్నాము కాబట్టే, వాడి పట్ల చాలా ప్రేమను కలిగి ఉన్నాము. బహుశా వారిని పడుకోబెట్టాల్సిన అవసరం కూడా ఉండవచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. "నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను మరియు నేను పడుకోవాలనుకోవడం లేదు" అని మన బాబు చెబితే, మనం దాన్ని సీరియస్ గా తీసుకోము, ఎందుకంటే వాడు అనారోగ్యంతో ఉన్నాడు. కాబట్టి, ఈ విధంగా, వారితో ఉండటానికి అసహ్యించుకునే ఈ వ్యక్తి పట్ల మన ఆలోచనను మార్చడం, వారిని చికాకు కలిగించే పురుగుగా చూడకుండా, అనారోగ్యంతో ఉన్న పిల్లవాడిగా చూడటం చేయాలి. ఈ విధంగా, మనం వాడిగురించి మాత్రమే ఆందోళన చెందుతాము, మన గురించి కాదు.

సమస్యాత్మక వ్యక్తులను మన ఉపాధ్యాయులుగా పరిగణించడం

మూడవ మార్గం వారిని మన గురువులుగా భావించడం. అతిషా టిబెట్ వెళ్లినప్పుడు తనతో పాటు ఒక భారతీయ వంటమనిషిని తీసుకువచ్చాడని ఈ ప్రసిద్ధ కథ ఉంది. ఈ భారతీయ వంటవాడు ఎప్పుడూ చెప్పేది వినకుండా ఎప్పుడూ తిరిగి వాదించేవాడు. టిబెటన్లు అతిషాతో ఇలా అన్నారు, "మీరు అతన్ని భారతదేశానికి ఎందుకు తిరిగి పంపరు? మేము మీ కోసం వంట చెయ్యగలం" అని. అతిషా అప్పుడు ఇలా చెప్పారు, "లేదు, లేదు! అతను నా వంటవాడు మాత్రమే కాదు; అతనే నా సహనానికి గురువు. కాబట్టి, మన జీవితంలో చిరాకు కలిగించే బంధువు ఉంటే, ఉదాహరణకు, ఏ సందర్భంలోనైనా మనం వ్యవహరించాల్సి వస్తే, ఈ వ్యక్తిని మన సహన గురువుగా పరిగణించడం చాలా సహాయపడుతుంది.

ప్రజలు మనకు చాలా విషయాలు నేర్పగలరు. ఉదాహరణకు చెడుగా ప్రవర్తించడం ద్వారా, వారు అలా ప్రవర్తించకూడదని మనకు నేర్పగలరు. మన కుక్క కూడా మనకు గురువు కాగలదు. మీ కుక్కను మీతో తీసుకువెళితే, కుక్క ఎక్కడైనా నేలపై పడుకుని విశ్రాంతి తీసుకోగలదు మరియు నిద్రపోగలదు అని మీరు ఎప్పుడైనా గమనించారా, కానీ మనం మాత్రం, "ఓహ్, నాకు ఒక స్పెషల్ మంచం, ఒక స్పెషల్ డ్రెస్ కావాలి, మరియు అది సాఫ్ట్ గా ఉండాలి, " లేదా "ఇది హార్డ్ గా ఉండాలి" లేదా ఇది, అది అని చాలా అంటాం. కుక్క ఎప్పుడూ కంప్లైంట్ చేయదు. కుక్క ఎక్కడైనా పడుకుంటుంది. ఇదొక గొప్ప బోధన. ఇతరులు మనకు ఇబ్బంది కలిగించినప్పుడు వారిని భిన్నంగా చూసే మార్గాలు ఇవి - వారిని కోరికలు తీర్చే రత్నంగా లేదా అనారోగ్యంతో ఉన్న మన బాబుగా లేదా ఒక ఉపాధ్యాయుడిగా చూడండి.

నెగెటివ్ పరిస్థితులను పాజిటివ్ గా మార్చడం: మనల్ని మనం ఎలా చూసుకుంటాం అని

ఇతరులకు విజయాన్ని అందించడం

ఈ పరిస్థితుల్లో మనల్ని మనం భిన్నంగా ఎలా చూడవచ్చో, మన పట్ల మన ఆలోచనను ఎలా మార్చుకోవాలో అనే దానికి కూడా పద్ధతులు ఉన్నాయి. మొదటిది "విజయాన్ని ఇతరులకు ఇవ్వండి మరియు నష్టాన్ని మీ మీద వేసుకోండి." మరో మాటలో చెప్పాలంటే, స్వార్ధపు ఆలోచనతో, మనల్ని మనం ఎప్పుడూ ఇలా అనుకుంటాము, "నేను గెలవాలి; నాకంటూ ఒక దారి ఉండాలి మరియు అవతలి వ్యక్తి నాకు లొంగిపోవాలి" అని; అయితే, మన నష్టాన్ని మనం అంగీకరిస్తే, ఈ వాదన ముగిసిపోతుంది. ఉదాహరణకు, ఒక సాధారణ ఉదాహరణ, మీరు మీ స్నేహితుడు లేదా భాగస్వామితో ఉన్నారు మరియు ఏ రెస్టారెంట్‌కు వెళ్లాలో మీరు నిర్ణయించుకోవాలి. మీ స్నేహితుడు ఒక నిర్దిష్ట ప్రదేశానికి వెళ్లాలనుకుంటే మరియు మీరు వేరొక ప్రదేశానికి వెళ్లాలనుకుంటే, అప్పుడు మీరు వాదించడం ప్రారంభిస్తారు. కానీ చివరికి, ఇది ఏమి తేడాను ఇస్తుంది? మీరు అంగీకరిస్తే, "సరే. మీ రెస్టారెంట్ కి వెళ్దాం" అంటూ వాదన ముగుస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, మనకంటే ఎదుటి వ్యక్తిని ఎక్కువగా ప్రేమించి, వారికి విజయాన్ని అందిస్తే వాదన ముగుస్తుంది.

ఇప్పుడు, మనం నిజంగా తీవ్రమైన పరిస్థితుల గురించి మాట్లాడటం లేదు, ఇందులో అవతలి వ్యక్తి చాలా నెగెటివ్ మరియు వినాశకరమైన దాన్ని సూచిస్తున్నాడు, కానీ అది లోతైన తేడాను కలిగించనప్పుడు, మరొకరికి విజయాన్ని ఇవ్వండి. నిజానికి, ఈ ప్లాన్ గురించి మీకు అభ్యంతరాలు ఉండవచ్చు, మీరు ఎప్పుడూ లొంగిపోతుంటే మరియు అవతలి వ్యక్తి మిమ్మల్ని ఉపయోగించుకుంటే అని, కాబట్టి ఈ పద్ధతిని ఉపయోగించినప్పుడు మీరు సున్నితంగా ఉండాలి. కానీ అనేక సందర్భాలు ఉన్నాయి, వీటిలో సమస్యను ఎదుర్కోవటానికి ఇదే ఉత్తమ మార్గం.

నేను నా స్వంత అనుభవం నుంచి మీకు ఒక ఉదాహరణను ఇస్తాను. నేను బెర్లిన్ లోని ఒక ప్రధాన రెస్టారెంట్ జిల్లాలో నివసిస్తున్నాను, రద్దీగా ఉండే ఒక మూలలో. నేను ఒక అపార్ట్‌మెంట్ భవనంలో నివసిస్తున్నాను మరియు గ్రౌండ్ ఫ్లోర్లో చాలా నిశ్శబ్దమైన భోజనశాల ఉండేది, కానీ ఇప్పుడు అక్కడ ఒక కొత్త రెస్టారెంట్ కట్టారు, చాలా ప్రసిద్ధ స్పానిష్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ వారంలో ఏడు రోజులు ఉదయం ఏడు గంటల నుంచి మూడు గంటల వరకు తెరిచి ఉంటుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు, వారు నా భవనం యొక్క రెండు వైపులా బయట టేబుల్స్ పెడతారు. బయట కూర్చొని బీరు, వైన్ తాగుతూ తెల్లవారు జామున మూడు గంటల వరకు గట్టిగా మాట్లాడుకుంటూ నవ్వుతుంటారు. వాళ్ళు ముందు రెస్టారెంట్ ను తెరిచినప్పుడు, నా పడకగది కిటికీల క్రింద అవుట్ డోర్ టేబుల్స్ ఉన్నప్పుడు, ఆ శబ్దం కారణంగా నేను నిద్రపోలేక రాత్రిపూట అక్కడే పడుకునే వాడిని. చిరాకుగా, నా గురించి మాత్రమే ఆలోచిస్తూ, వారి మంచి సమయం గురించి ఆలోచించకుండా, నాకు అన్ని రకాల ఫాంటసీలు ఉండేవి. మధ్యయుగపు కోటలో ఉండి, ఒక పెద్ద తారును ఉడకబెట్టి వాళ్లపై పోయడంలా నేను అనుకునేవాడిని. "నిశ్శబ్దంగా ఉండమని ప్రజలకు చెప్పండి లేదా నేను పోలీసులకు కాల్ చేస్తాను" అని ఎప్పుడూ ఫోన్ చేసి చెప్పే ముసలివాడిని నేను అవ్వలేను. ఇది పని చెయ్యదు.

కాబట్టి ఈ సమస్యను ఎదుర్కోవడానికి విజయాన్ని ఇతరులకు ఇవ్వడం మరియు నష్టాన్ని మనపై వేసుకోవడం ఒక్కటే మార్గం అని నేను నిర్ణయించుకున్నాను. నా పడకగదిలో నేను పడుకోవడం కంటే వేసవి సాయంత్రాన్ని ఆస్వాదించడం చాలా ముఖ్యం. మా ఇంట్లో వీధికి ఎదురుగా లేని ఒకే ఒక గది వంటగది. నాకు చాలా పెద్ద వంటగది ఉంది, బ్రేక్ ఫాస్ట్ ఏరియాకి చాలా చోటు ఉంది. కాబట్టి నేను వేడిగా ఉండే నెలల్లో అక్కడే నిద్రపోతాను. నేను పగటిపూట నా పరుపును గోడకు ఆనించి, రాత్రి దాన్ని నేలపై ఉంచుకుని వంటగదిలో పడుకుంటాను. నా ఇంట్లో పూర్తి నిశ్శబ్దంగా మరియు చల్లని గది అదే.

వంటగదిలో పడుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. నేను వారికి విజయాన్ని ఇచ్చాను, మరియు వాళ్ళు ఎంత శబ్దం చేసినా నేను పట్టించుకోను, ఎందుకంటే నేను వాళ్లను వినను. న్యూ ఇయర్ కి ముందు రోజుల్లో ఇలాగే ఉండేది ఎందుకంటే జర్మన్లు బాంబులను చాలా ఇష్టపడతారు. వీధిలోంచి చాలా బిగ్గరగా వినిపిస్తుంది కానీ, మళ్ళీ నేను దాని గురించి నా వైఖరిని మార్చుకుని వంటగదిలో పడుకుని వారికి విజయాన్ని అందిస్తే, ఎటువంటి సమస్య ఉండలేదు.

నాకు జరిగే నెగెటివ్ విషయాలు నా నెగెటివ్ కర్మను పోగొడతాయి

రెండవ పద్ధతి ఏమిటంటే, మనకు జరుగుతున్న నెగెటివ్ విషయాలను "నా నెగెటివ్ కర్మను పోగొట్టేవాటిలా" చూడటం. దీని అర్థం మనం దాన్ని ఒక శిక్షగా అంగీకరిస్తున్నామని కాదు, కానీ ఈ కష్టమైన విషయం కొన్ని నెగెటివ్ పనులను చిన్నగా పోగొట్టేవి అని మనం అనుకుంటున్నాము, అలా చెయ్యడం వల్ల, ఇది భవిష్యత్తులో ఎక్కువ భయంకరమైన విషయంగా మారకుండా ఉంటుంది. ఒక సాధారణ ఉదాహరణ: మీరు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు మరియు మీరు ఎక్కువ సేపు కదలలేరు. కాబట్టి, మీరు ఇలా అనుకుంటారు, "సరిపోయింది! ఇది పక్షవాతానికి గురయ్యే కర్మను తీసుకొస్తుంది, జీవితంలో తర్వాత నాకు స్ట్రోక్ వస్తే నేను నిజంగా ఇలాగే కదలలేను" అని. ఈ విధంగా, ఈ నెగెటివ్ విషయాలు జరుగుతున్నాయని మనం సంతోషిస్తాము, ఎందుకంటే ఇది భవిష్యత్తులో విషయాలు ఇంకా బాగా ఉండటానికి మార్గం సులభతరం చేస్తుంది.

సంప్రదాయ బౌద్దులు హానికరమైన ఆత్మలను నమ్ముతారు. వాటి ఉనికిని కూడా మనం అంగీకరిస్తే, ఈ వైఖరి మార్పును మనం మరో అడుగు ముందుకేసి హానికరమైన ఆత్మలను అడుగవచ్చు, "నాకు ఇంకా హాని కలిగించండి. ఇంకా చెయ్యండి" అని. ఈ మధ్య నాకు ఒక మంచి అనుభవం ఎదురైంది. జూలై నెల మధ్యలో మొదలై ఈ రెండు నెలల పాటు అంతా సవ్యంగా సాగింది. అంతా బాగుంది. నా వీపుపై ఇన్‌ఫెక్షన్ వచ్చింది మరియు నేను సుమారు రెండు నెలల పాటు ఫిట్‌నెస్ క్లబ్‌కు వెళ్లలేకపోయాను, ఎందుకంటే చివరికి, ఇన్‌ఫెక్షన్ పోయినప్పుడు, వాటిని కత్తిరించవలసి వచ్చింది. అప్పుడు నా కంప్యూటర్ లో ఒక భయంకరమైన వైరస్ వచ్చింది. ఇది హార్డ్ డిస్క్ ను కూడా నాశనం చేసింది, కాబట్టి నేను నా సాధారణ కంప్యూటర్ లేకుండా ఒక నెల గడిపాను. అప్పుడు ప్రింటర్ పగిలిపోయింది; మరియు నాకు రెండు వీడియో ప్లేయర్లు ఉన్నాయి, అవి కూడా విరిగిపోయాయి. నేను జ్యోతిష్యానికి పెద్ద అభిమానిని - కొన్ని వివరించలేని కారణాల వల్ల, నేను ప్రజల నుంచి సేకరించిన అన్ని జాతకాల డేటాబేస్ మాయమైంది. ఆ సమాచారాన్ని తిరిగి పొందే అవకాశం లేదు. అప్పుడు నేను ఎప్పుడూ తాగే నాకు ఇష్టమైన కప్పును పగలగొట్టాను, ఆ తర్వాత - దీని మధ్యలో - దలైలామా బోధనల కోసం నేను ఫ్రాన్స్ కు వెళ్ళాను మరియు విమానయాన సంస్థ నా లగేజీని పోగొట్టింది.

ఇదే చివరిగా జరిగింది. నా లగేజీ పోయినప్పుడు, నేను నవ్వాను; చాలా హాస్యాస్పదంగా అనిపించింది. అప్పుడు నేను ఇలా ఆలోచించడం ప్రారంభించాను, "ఎక్కువ తీసుకోండి, హానికరమైన ఆత్మలు! ఇంకేం తప్పు జరిగేలా చేస్తారు?" ఇది నాకు చాలా మంచి అనుభూతిని కలిగించింది. అడ్డంకులను నివారించడానికి భావోద్వేగ గోడలు వెయ్యడానికి బదులుగా, నేను వాటిని బహిరంగంగా అంగీకరించాను మరియు వాటిని బాగా స్వాగతించాను.

కొన్ని సంవత్సరాల క్రితం, నాకు దంతాల కింద నా దవడ ఎముకలో ఇన్‌ఫెక్షన్ వచ్చింది, దీని కోసం నేను ఇంతకు ముందే రూట్ కెనాల్ చేయించుకున్నాను మరియు దవడ ఎముక యొక్క ఒక భాగాన్ని కత్తిరించడానికి దంత శస్త్రచికిత్స చెయ్యాల్సి వచ్చింది. ఫ్రాన్స్ పర్యటన తర్వాత, నేను దంతవైద్యుని వద్దకు వెళ్ళాను మరియు మచ్చ కణజాలంలో ఇన్‌ఫెక్షన్ మళ్ళీ వచ్చిందని అతను నాకు ఒక సంతోషకరమైన వార్తను ఇచ్చాడు, మరియు ఎముక నుంచి ఇంకా కత్తిరించడానికి నేను రెండవ దంత శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. నేను ఈ వార్తను పాజిటివ్ దృక్పథంతో మార్చగలిగాను, "అద్భుతం! ఇది నా వెబ్‌సైట్లో తర్వాతి భాషా విభాగాలను ఉంచడానికి ఉన్న అడ్డంకులను తొలగిస్తోంది" అని.

బౌద్ధమత బోధనల ప్రకారం, మీరు సాధించడానికి ప్రయత్నిస్తున్న విషయం ఎంత పాజిటివ్ గా ఉంటే, అది జరగకుండా నిరోధించడానికి అన్ని అడ్డంకులు ఉంటాయి. కాబట్టి, నేను ఈ సంఘటనలన్నింటినీ అడ్డంకులను తెస్తున్న ఒక అద్భుతమైన పరిస్థితిగా చూశాను, కాబట్టి నేను హానికరమైన ఆత్మలను ఇలా అడిగాను, "నాకు ఇంకా కష్టాలను తీసుకురండి; వాటిని నా మీదకు విసిరేయండి!" అని. ఇలా చెయ్యడం వల్ల, ప్రతిదీ పాడయిపోవడంతో నేను అస్సలు అసంతృప్తి చెందలేదు. కాబట్టి, మీరు ఈ మైండ్ ట్రైనింగ్ పద్ధతిని అప్లై చెయ్యగలిగితే, అది బాగా పనిచేస్తుంది. ఒక పరిస్థితిని కష్టమైనది, భయంకరమైనది మరియు నిరుత్సాహపరిచేదిగా చూడటానికి బదులుగా, మీరు మీ వైఖరిని మార్చుకుంటారు మరియు దానిని అద్భుతమైనదిగా చూస్తారు.

ఇతరులకు సంతోషాన్ని ఇవ్వడం మరియు వారి బాధలను స్వీకరించడం (టాంగ్లెన్)

నేను చెప్పదలచుకున్న చివరి పద్ధతి బహుశా అన్నిటిలో అత్యంత అధునాతనమైనది మరియు కష్టమైనది. అదే టాంగ్లెన్, ఇవ్వడం మరియు తీసుకోవడం యొక్క ప్రాక్టీస్. ఉదాహరణకు పంటినొప్పి లాంటి ఏదైనా కష్ట పరిస్థితిని మీరు ఎదుర్కుంటున్నప్పుడు, "ప్రతి ఒక్కరి పంటి నొప్పులు వాటిని వదిలి నాకు రావాలి. అందరి పంటినొప్పిని నా మీద వేసుకోవడం వల్ల ఇంకెవరికీ మళ్లీ పంటినొప్పి రాకూడదు. మన మనస్సులను, హృదయాలను ప్రతి ఒక్కరికి తెరవడ౦ ద్వారా, బాధను ఇష్టపూర్వక౦గా స్వీకరి౦చడ౦ ద్వారా, "పేద నేను" అని మాత్రమే ఆలోచి౦చడ౦లోని భయాన్ని, దుఃఖాన్ని అధిగమిస్తా౦. ఈ టాంగ్లెన్  తో ఇంకొంచెం ముందుకెళ్ళి "వాళ్ళ బాధలు, కష్టాలన్నీ పోగొట్టి, ఆ తర్వాత నా మనసులోని ప్రాథమిక ఆనందాన్ని గ్రహించి, ఆ ఆనందాన్ని వారందరికీ పంపుతాను" అని అనుకుంటూ ఉంటాం.

ఇప్పుడు, "నేను మీ కోసం బాధపడతాను" అనే అమరవీరుడి భంగిమను అవలంబించకుండా మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది ఒక రకంగా అహంకారానికి ప్రతిబింబం. నేను ఈ పద్ధతిలో మంచివాడిని కాదని అంగీకరించాలి. నిజాయితీగా చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి కానీ ఈ మధ్యే నేను దాన్ని ట్రై చేశాను.

నేను నా దవడకు రెండవ శస్త్రచికిత్స చెయ్యాల్సి ఉందని మరియు పూర్తి ఆపరేషన్ సమయంలో మీరు మేల్కొని ఉన్నారని నేను చెప్పాను. ఇది చాలా ఆనందదాయకం! వారు మీ మొత్తం గమ్‌ను మీ నోటి యొక్క ఒక వైపు తెరిచి, తీసి, ఆపై ఎలక్ట్రిక్ రంపం లాంటి దాన్ని తీసుకొని లోపలికి వెళ్లి దవడ ఎముక యొక్క ఒక ముక్క మరియు దంతాల మూలం యొక్క చిన్న చివర భాగం మరియు దాని చుట్టూ కొంత మాంసాన్ని కత్తిరించండి. వారు చేసే విధానంలో ఇది దాదాపు మధ్య సమయం. నేను మొదటిసారి చేసినప్పుడు, వారు ఏమి చేస్తున్నారో నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇది అంత బాధాకరమైనది కాదు, ఎందుకంటే ఎనస్తీషియా చాలా బాగుంటుంది, అయినప్పటికీ మధ్యలో నేను దాన్ని ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. కానీ నేను రెండవ సారి చేసినప్పుడు, సంక్రమణ చాలా ఎక్కువగా ఉంది, మరియు మీకు ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు, నోవోకైన్ ఆ ప్రాంతంలో పనిచేయదు, కాబట్టి ఇది చాలా బాధాకరంగా ఉంటుంది.

నేను మహాముద్రలో ఉపయోగించిన పద్ధతిని కూడా ప్రయత్నించాను - ఇది ఒక సంచలనం, పెద్ద విషయం ఏమీ కాదు. మీరు మీ చేతిని చక్కిలిగింతలు పెట్టినా, గిచ్చినా, స్క్రాచ్ చేసినా లేదా కత్తిరించినా, అది కేవలం శారీరక అనుభూతి మాత్రమే, అంతకు మించి ఇంకేమీ ఉండదు, కాబట్టి దాని గురించి పెద్ద సీన్ చెయ్యకండి. అది కొంతవరకు పనిచేసింది, కానీ అప్పుడు నాకు టాంగ్లెన్ గుర్తుకు వచ్చింది. టిబెట్ లో ముఖ్యంగా పెద్ద ఎత్తున చిత్రహింసలు జరుగుతున్న సమయం అది. అక్కడి ప్రజలు అనుభవిస్తున్న కష్టాల గురించి నేను ఆలోచించడం ప్రారంభించాను, దానితో పోలిస్తే, నేను అనుభవిస్తున్నది పెద్దదేమీ కాదు - అది చాలా చిన్నది. ఇది రెండు నిమిషాలు ఉంటుంది మరియు తర్వాత పోతుంది.

కాబట్టి, "పాపం, నేను బాధపడుతున్నాను" అని ఆలోచించే బదులు, టిబెట్ లోని ఈ ప్రజలందరి గురించి ఆలోచించడానికి నేను నా ఆలోచనా విధానాన్ని విస్తరించాను మరియు "నాకు ఉన్న ఈ చిన్న బాధ కంటే వారికి ఉన్న బాధలే చాలా ఎక్కువ" అని అనుకున్నాను, కాబట్టి ఇది నా బాధను పూర్తిగా భిన్నమైన ఆలోచనలో ఉంచింది. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, "నా దవడలోని ఈ నొప్పిలో వారి బాధలు, బాధలన్నీ తొలగిపోవాలి, దీని ద్వారా నేను ప్రశాంతంగా, సంతోషంగా ఉండటం ద్వారా, నేను వారికి ఆ మనశ్శాంతిని ఇవ్వగలను" అని. 

నేను ఖచ్చితంగా 100% సరిగ్గా చెయ్యనప్పటికీ, పరిస్థితిని ఎదుర్కోవడంలో ఇది చాలా సహాయపడింది. మీరు దీన్ని సరిగ్గా చేస్తే, మీరు వారి నొప్పిని అనుభవించాలనుకుని అది మీ నొప్పిని ఇంకా పెంచుతుంది. నిజాయితీగా చెప్పాలంటే, మీరు దాన్ని మాటలలో చెప్పవచ్చు, కానీ దాని అర్థం ఏమీ ఉండదు. అలా జరగాలని కోరుకోవడం వేరే విషయం. కానీ కనీసం వారి బాధను పీల్చుకోవాలనే భావన, ఈ బాధ ఉంటే చాలు - కనీసం ఆ స్థాయిలోనైనా చెయ్యడం సాధ్యమే.

అయితే దాన్ని అసలు విషయంతో అయోమయానికి గురిచెయ్యకూడదు. అసలు విషయం చాలా తీవ్రమైనది, ఎందుకంటే మీరు ఇక్కడ అభివృద్ధి చెందుతున్న మానసిక స్థితి, మీరు ఇక్కడ ఉపయోగిస్తున్న మానసిక స్థితి, నొప్పితో పోరాడటానికి బదులుగా, మీరు దాన్ని స్వచ్ఛందంగా స్వీకరిస్తున్నారు, మీరు దాన్ని ఎదుర్కోగలరనే ఆత్మవిశ్వాసంతో. ప్రతి ఒక్కరి బాధలో ఇంత పెద్ద ఎత్తున మీరు ఈ పని చేస్తుంటే, మీ బాధను అంగీకరించడానికి మరియు ఎదుర్కోవటానికి మీకు ఆత్మవిశ్వాసం ఉంటుంది, దానితో పోరాడకూడదు మరియు దానితో విసుగు చెందకూడదు అని. కాబట్టి, ఇది మాయా పద్ధతి కాదు; దానితో ఏమి జరుగుతుందో మీరు విశ్లేషిస్తే, అది చాలా అర్ధవంతంగా ఉంటుంది.

సారాంశం

కాబట్టి, మన ప్రాధమిక శ్రద్ధ ఇతరులతో ఉండటానికి మైండ్ ట్రైనింగ్, లోజాంగ్ లో ఉపయోగించే కొన్ని పద్ధతులు ఇవి. మన ప్రేరణ స్థాయితో సంబంధం లేకుండా, అటువంటి వైఖరి మార్పు మనకు చాలా సహాయపడుతుంది. దీని నుంచి వచ్చే సొంత పరివర్తన ఏమిటంటే, ఆలోచించే మరియు నిజాయితీగా అనుభూతి చెందే సామర్థ్యం, "ఎటువంటి ప్రతికూల, కష్టమైన పరిస్థితులు వచ్చినా, నేను 'పేదవాడిని' అని అనుకోను మరియు అది నాకు హాని కలిగించదు. అది నన్ను నిరుత్సాహపరచనివ్వను" అని. దీనికి బదులుగా, "ఏమి జరిగినా, నేను దాన్ని మార్చగలను" అనే సాధారణ ఆలోచన మనం జీవితంలో అభివృద్ధి చేసుకుంటాము. ఇతరుల పట్ల ఎక్కువ శ్రద్ధను పెంపొందించడానికి నేను దాన్ని ఉపయోగించగలను. అది అడ్డంకిగా ఉండదు' అని చెప్తారు. అటువంటి ఆలోచనను కలిగి ఉండటం మీకు జీవితంలో మంచి ధైర్యాన్ని ఇస్తుంది.

Top