చర్చ యొక్క ఉద్దేశ్యం మరియు ప్రయోజనాలు

01:58
బౌద్ధమతం గురించి చర్చ అంటే తెలివైన లాజిక్ తో ఒకరిని ఓడించడం కాదు. విద్యార్థులు తమ అవగాహనలో స్థిరత్వాన్ని పెంపొందించుకోవడానికి మరియు వారికి ధ్యానంలో ఎటువంటి సందేహాలు ఉండకుండా చెయ్యడానికి సహాయపడటానికి. ఒక తరగతిలోని ప్రతి విద్యార్థి తన తోటి క్లాస్ మేట్ లను ప్రశ్నలు అడుగుతూ వారి సమాధానాలలో ఏవైనా తప్పులు ఉంటే వాటికి ఎత్తి చూపి సరిదిద్దమని సవాలు చేస్తాడు. చివరికి ఇద్దరూ లాభపడతారు.

బౌద్ధమత శిక్షణలో చర్చ యొక్క ప్రధాన ఉద్దేశాలలో ఒకటి నిర్ణయాత్మక అవగాహనను పెంపొందించుకోవడం (ఎన్జెస్-షేస్). మీరు ఒక పొసిషన్ ని తీసుకుంటారు మరియు ఆ తర్వాత మీ చర్చా భాగస్వామి దాన్ని అనేక కోణాల నుంచి సవాలు చేస్తాడు. మీరు అన్ని అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఆ పొసిషన్ ని సమర్థించుకోగలిగితే మరియు దానికి లాజిక్ అస్థిరతలు లేవని మరియు వైరుధ్యాలు లేవని మీరు కనిపెడితే, మీరు ఆ పొసిషన్ పై దృష్టి పెట్టవచ్చు లేదా మార్చలేని ఆ పూర్తి నిర్ణయాత్మక అవగాహనతో చూడవచ్చు. ఈ మానసిక స్థితిని మనం దృఢమైన విశ్వాసం (మోస్-పా) అని కూడా పిలుస్తాము. అశాశ్వతం, సమానత్వం, తనకంటే ఇతరులు విలువైన వారు, బోధిచిత్త, శూన్యత వంటి ఏ విషయంపై అయినా ఏక దృష్టితో ధ్యానం చేసేటప్పుడు ఈ నమ్మకమైన అవగాహన, దృఢమైన విశ్వాసం ఉండాలి. విశ్లేషణాత్మక ధ్యానం ద్వారా లేదా ధర్మం గురించి ఆలోచించడం ద్వారా మీరు మీ స్వంతంగా ఆ నమ్మకమైన అవగాహనను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తే, మీ భాగస్వాముల మీతో చర్చిస్తున్నప్పుడు మీరు మీ అవగాహనను సాధ్యమైనంత ఎక్కువ అభ్యంతరాలతో ప్రశ్నించలేరు. ఇతరులు మీ లాజిక్ లో తప్పులను మీకన్నా సులభంగా కనిపెట్టవచ్చు.

ఇంకా ఏమిటంటే, చర్చ ప్రారంభకులకు ఏకాగ్రతను పెంపొందించడానికి ధ్యానం కంటే అనుకూలమైన పరిస్థితిని అందిస్తుంది. చర్చలో మీ భాగస్వామి యొక్క సవాలు మరియు తోటి విద్యార్థులు వినడం యొక్క ప్రభావం మిమ్మల్ని ఏకాగ్రతకు బలవంతం చేస్తుంది. ఒంటరిగా ధ్యానం చేసేటప్పుడు, సంకల్ప బలం మాత్రమే మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టకుండా ఉండడం లేదా నిద్రపోకుండా చేస్తుంది. దీనికి తోడు సన్యాస చర్చా వేదికలపై చాలా డిబేట్లు పక్క పక్కనే చాలా బిగ్గరగా జరుగుతాయి. ఇది మిమ్మల్ని కూడా బలవంతం పెడుతుంది. మీ చుట్టూ జరిగే చర్చలు మీ దృష్టిని మార్చినా లేదా మీకు చిరాకు కలిగించినా, మీరే నష్టపోతారు. మీరు చర్చా ప్రదేశంలో ఏకాగ్రత నైపుణ్యాలను పెంపొందించుకున్న తర్వాత, వాటిని ధ్యానానికి వర్తింపజేయవచ్చు, శబ్దం ఉన్న ప్రదేశాలలో కూడా ధ్యానం చెయ్యవచ్చు.

అంతేకాక, చర్చలు మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చెయ్యడానికి సహాయపడతాయి. మీరు సిగ్గుపడుతూ చర్చించలేరు. మీ ప్రత్యర్థి మీకు సవాలు చేసినప్పుడు మీరు మాట్లాడాలి. మరోవైపు, మీరు అహంకారంతో లేదా కోపంగా ఉంటే, మీ మనస్సు అస్పష్టంగా ఉంటుంది మరియు మీ భాగస్వామి మిమ్మల్ని ఓడిస్తాడు. అన్ని సమయాల్లో, మీరు భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవాలి. గెలిచినా, ఓడినా ఖండించాల్సిన 'నేను'ను గుర్తించడానికి ఈ చర్చ మంచి అవకాశం కల్పిస్తుంది. "నేను గెలిచాను" నేను చాలా తెలివైనవాడిని" లేదా "నేను ఓడిపోయాను; నేను చాలా తెలివితక్కువ వాడిని" అని మీరు ఆలోచించినప్పుడు లేదా అనుభూతి చెందినప్పుడు మీరు మీ గుర్తించే దృఢమైన, సొంత-ముఖ్యమైన "నేను" యొక్క తీరును తెలుసుకుంటారు. ఇది "నేను" అనే స్వచ్ఛమైన ఆలోచన మరియు ఖండించదగినది.

మీ డిబేట్ పార్టనర్ కు అతని స్థానం లాజికల్ కాదని మీరు నిరూపించినప్పటికీ, మీరు తెలివైన వారని మరియు అతను మూర్ఖుడని ఇది రుజువు చేయదని మీరు గుర్తుంచుకోవాలి. మీ ప్రేరణ ఎప్పుడూ మీ భాగస్వామికి లాజికల్ గా నిరూపించబడే దానిపై స్పష్టమైన అవగాహన మరియు దృఢమైన నమ్మకాన్ని పెంపొందించడానికి సహాయపడుతూ ఉండాలి.

Top